షూటింగ్ లో భారీ ప్రమాదం: సెట్ పై టాలీవుడ్ హీరో- రూ.60 లక్షల కెమెరా మాయం
టాలీవుడ్ హీరో సుహాస్ నటిస్తోన్న తాజా చిత్రం.. మందాడి. ఈ సినిమా ద్వారా తమిళంలో అరంగేట్రం చేస్తోన్నాడు సుహాస్. తమిళ కమేడియన్ సూరి హీరో. మత్తిమారన్ పుహళేంది దర్శకుడు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇందులో కరడుగట్టిన విలన్ క్యారెక్టర్ ను పోషిస్తోన్నాడు సుహాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడు చురుగ్గా సాగుతోంది. రామనాథపురం జిల్లా తీర ప్రాంత గ్రామం తొండి సమీపంలో సముద్రంలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది.
తాజాగా ఈ మూవీ షూటింగ్ లో ప్రమాదం సంభవించింది. సముద్రంలో చిత్రీకరణ సాగుతున్నప్పుడు యూనిట్ వినియోగిస్తోన్న పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో పడవలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరినీ కాపాడారు. కెమెరాలు, ఇతర షూటింగ్ సామగ్రి మాత్రం సముద్రం పాలయ్యాయి. వీటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఒక్క కెమెరానే 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని తమిళ మీడియా తెలిపింది.

ద్విభాషా చిత్రంగా మందాడి ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. తమిళ వెర్షన్‌లో సూరి హీరో. సుహాస్ విలన్‌గా కనిపించనున్నారు. తెలుగు వెర్షన్‌లో సుహాస్ హీరోగా, సూరి విలన్‌గా నటిస్తోన్నారు. సుహాస్‌కు ఇదే తొలి తమిళ సినిమా. ఈ చిత్రానికి పుహళేందీ కథను సమకూర్చారు. స్వీయ దర్శకత్వంలో దీన్ని తెరకెక్కిస్తోన్నారు. ఆర్‌ఎస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తోన్న మూవీ ఇది. సూరి, సుహాస్‌తో పాటు సత్యరాజ్, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచానా నమిదాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications