బాంబు భయంతో బెంబేలేత్తిన నటి ఖుష్బూ: ట్వీట్ ఇలా..
తన నివాసంలో బాంబు పెట్టినట్లు ఫోన్ రావడంతో సినీ నటి ఖుష్బూ బెంబేలెత్తిపోయారు. ఆ తర్వాత ఆమె తనకు ఏమీ కాలేదని ట్వీట్ చేశారు.
చెన్నై: ప్రముఖ సినీ నటి ఖుష్బూను బాంబు వార్త తీవ్రంగా కలవర పెట్టింది. తమిళనాడులోని ఖుష్బూ నివాసంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఖుష్బూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్, జాగిలాల సాయంతో ఆమె ఇళ్లంతా సోదా చేశారు. ఎక్కడా బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎవరో కావాలనే ఈ ఫోన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖుష్బూ ఫిర్యాదు మేరకు ఆమెకు వచ్చిన కాల్ ఆధారాంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాను బాగానే ఉన్నానని, తనకేం కాలేదని ప్రముఖ నటి, కాంగ్రెస్ మహిళా నేత కుష్బూ సుందర్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఆమె ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆమె ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున వాకబు చేశారు. దీంతో స్పందించిన కుష్బూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు సందేశం ఇచ్చారు. తాను క్షేమంగానే ఉన్నానని, దిగులు చెందవద్దని సూచించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications