వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు కొన్నారా, నోటీసులు అందుకొంటారు

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కార్లు కొనుగోలుచేస్తే ఆదాయపు పన్నుశాఖ నుండి నోటీసులు అందే అవకాశం ఉంది. నవంబర్ 8వ, తేదికి ముందు కార్లు కొనుగోలుచేసినట్టుగా రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ఆదాయపు పన్నుశ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కార్లు కొనుగోలుచేస్తే ఆదాయపు పన్నుశాఖ ద్వారా నోటీసులు అందే అవకాశం ఉంది. ఈ మేరకు నవంబర్ 8వ, తేది తర్వాత కార్లు కొనుగోలుచేసిన వారి సమాచారం ఇవ్వాలని ఆదాయపు పన్నుశాఖాధికారులు కార్ల డీలర్లకు నోటీసులు జారీ చేసింది.

దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆదాయపు పన్నుశాఖ కార్ల విక్రయాలపై కేంద్రీకరించింది. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కొనుగోలుచేసిన కార్ల వివరాలపై ఆదాయపు పన్ను వివరాలను సేకరిస్తోంది. కార్ల విక్రయాల వివరాలను ఇవ్వాలని కోరుతూ డీలర్లకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీచేసింది.

car

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కార్లు కొనుగోలుచేసిన తర్వాత కొత్తసంవత్సరంలో నోటీసులు జారీచేసే అవకాశం ఉంది. ఆయా కార్ల డీలర్ల నుండి ఆదాయపు పన్నుశాఖ కార్లు కొనుగోలుచేసిన వివరాలను సేకరించింది.

ఆధాయపు పన్నుశాఖ నుండి నోటీసులు అందాయని కొన్ని కార్ల కంపెనీల డీలర్లు ధృవీకరిస్తున్నారు. అయితే పెద్ద నగదు నోట్ల రద్దుకంటే ముందుగానే కార్లను కొనుగోలుచేసినట్టు తప్పుడు ఢృవీకరణ పత్రాలు సృష్టించే అవకాశం ఉందనే అనుమానాన్ని కూడ ఆధాయపు పన్నుశాఖాధికారులు వ్యక్తం చేస్తున్నారు.

అయితే నవంబర్ , డిసెంబర్ మాసాల్లో అత్యధికంగా కార్ల విక్రయాలు, ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ అయిన ఖాతాలపై ఆదాయపు పన్నుశాఖాధికారులు కేంద్రీకరించారు.

English summary
the income tax department has issued notice to car dealers asking them to provide details of all those who booked car after demonetasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X