అచ్చం అలాగే: స్కూల్లో బాలుడిపై కత్తితో దాడి, బాలిక పనేనా...
లక్నో: ఒకటో తరగతి బాలుడిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో పాఠశాలలోని టాయిలెట్లో దాడి జరిగింది. సీనియర్ విద్యార్థిని అతనిపై కత్తితో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. గుర్గావ్‌లోని రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన జరిగినట్లుగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఆరేళ్ల బాలుడి ఛాతీలో, కడుపులో తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే, అతని ప్రాణాలకు ముప్పు లేదని భావిస్తున్నారు. బ్రైట్‌ల్యాండ్ స్కూల్లో తన కుమారుడిపై ఓ బాలిక దాడి చేసిందని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఆరో తరగతి చదువుతున్న ఆ బాలిక కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. తమ కుమారుడికి గాయాలయ్యాయని, అతనిపై కత్తితో దాడి జరిగిందని పాఠశాల వర్గాలు తమకు చెప్పనట్లు బాలుడి తండ్రి చెప్పారు
దాడి చేనిన వ్యక్తిని పోలీసులు ఇంకా గుర్తించాల్సి ఉంది. దాడి చేసింది స్టూడెంటా, కాదా అనేది నిర్ధారించుకోవాల్సి ఉంది. బ్లూ వేల్ ప్రభావం ఈ దాడికి కారణమా అనేది కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
పాఠశాల నుంచి గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు కనిపిస్తోందని చికిత్స చేస్తున్న వైద్యుడు చెప్పారు. రియాన్ స్కూల్ సంఘటన నేపథ్యంలో తాము అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, బ్లూ వేల్ చాలెజ్ గేమ్ ప్రభావం ఏమైనా ఉందా అనేది పరిశీలిస్తున్నామని స్కూల్ డైరెక్టర్ వీణ వ్యాస్ చప్పారు.
పాఠశాలలోని 70 సెక్యూరిటీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండు తరగతి విద్యార్థి ప్రద్యున్ ఠాకూర్ వాష్ రూంలో గొంతు కోయడం వల్ల మరణించిన విషయం తెలిసిదే. అదే పాఠశాలకు చెందిన 16 బాలుడిని పోలీసులు ఈ కేసులో నిందితుడిగా గుర్తించారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications