తిరుమల బ్రహ్మోత్సవాలు, సింహ వాహనంపై యోగనరసింహ అలకారంలో శ్రీవారు !
తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు (brahmotsavam) రంగరంగవైభంగా సాగుతున్నాయి. తిరుమలలో (tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) భాగంగా మూడో రోజైన మంగళవారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు యోగనరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై (lion vehicle) తిరుమాడ (tirumala)వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
సింహ వాహనం - ధైర్యసిద్ధి:
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం (lion vehicle) పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమైనది. సింహ రూప (lion vehicle) దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది.

అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం (lion vehicle) ద్వారా శ్రీవారు నిరూపించారు.
మంగళవారం ఉదయం జరిగిన సిహవాహన సేవలో (brahmotsavam) తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ (TTD) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, టీటీడీ (TTD) అన్ని విభాగ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తిరుమలలో (tirumala) జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) భాగంగా తిరుమలలో భక్తుల సంఖ్య మోస్తారుగా ఉంది. సోమవారం తిరుమలలో శ్రీవారిని 73, 859 మంది భక్తులు (devotees) దర్శించుకున్నారు. సోమవారం రాత్రి వరకు శ్రీవారికి 30, 634 మంది భక్తులు (devotees) తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

సోమవారం శ్రీవారికి హుండీ ద్వారా రూ 3. 31 కోట్ల ఆదాయం వచ్చింది. తిరుమలలో (tirumala)క్యూకాంప్లెక్స్ లోని ఐదు కంపార్ట్ మెంట్లో లో భక్తులు (devotees) వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకన్లు లేని భక్తులకు (devotees) మూడు గంటల్లో శ్రీకలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కలుగుతోందని టీటీడీ (TTD) అధికారులు మంగళవారం తెలిపారు.












Click it and Unblock the Notifications