కాశ్మీర్‌లో కలకలం: రూ.36కోట్ల పాత నోట్లు సీజ్, 9మంది అరెస్ట్

Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం భారీగా రద్దయిన నోట్లు పట్టుబడ్డ ఘటన కలకలం రేపింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రూ. 36.34 కోట్ల విలువైన రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకుంది.

జమ్మూ, కాశ్మీర్‌లలో ఉగ్రవాదంపై నిధుల సేకరణకు సంబంధించిన కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం వెల్లడించింది. రూ. 36,34,78,500 విలువైన నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.

Breaking their backs: NIA seized Rs 36 crore demonetised currency in Kashmir

ప్రదీప్ చౌహాన్, భాగ్వాన్ సింగ్, వినోద్ శెట్టి, షానవాజ్ మీర్, దీపక్ తోఫ్రాన్ని, మజీద్ సోఫి, ఎజాజుల్ హసన్, జస్విందర్ సింగ్, ఉమయిర్ దార్‌లను అరెస్ట్‌ చేసినట్టు ఎన్ఐఏ వెల్లడించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, గత కొన్ని నెలలుగా జమ్మూ, కాశ్మీర్లో అనేక ప్రాంతాల్లోఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపులు అలజడిని సృష్టిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The National Investigation Agency has seized a whopping Rs 36 crore in demonetised currency while probing the Kashmir terror funding case. The money was seized from various quarters.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి