ఆశ్చర్యపరిచిన మోదీ చాణక్యం
PM Modi: రష్యాలోని కజాన్ వేదికగా ముగిసిన బ్రిక్స్ సమ్మిట్.. ప్రపంచ దేశాల్లో భారత కీలక పాత్ర పోషిస్తోందనే విషయాన్ని చాటి చెప్పింది. ఒకవంక కెనడా ఒక్కటి మినహాంచితే జీ7లో సభ్యత్వం ఉన్న శక్తిమంతమైన పాశ్చాత్య దేశాలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తూనే- మరోవంక బ్రిక్స్ సభ్య దేశాలు చైనా, రష్యా సహా ఇతర అభివృద్ధి చెందుతోన్న దేశాలతో సన్నిహితంగా మెలగడం భారత్ చతురతకు అద్దం పట్టింది.
పాశ్చాత్య దేశాల నుంచి ఎలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా బ్రిక్స్, జీ7 వంటి అత్యున్నత అంతర్జాతీయ గ్రూప్‌లతో స్నేహ సంబంధాలను కొనసాగించగల సామర్థ్యం దేశ ప్రతిష్ఠను పెంచింది. ఇది- దౌత్యనీతిలో భారత్ అనుసరిస్తోన్న విధానాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వివిధ దేశాల మధ్య ఏర్పడిన విభేదాలను సైతం రూపుమాపగలిగేలా ఆవిర్భవించగలుగుతోంది.. భారత్.

బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- రష్యా, చైనా అధ్యక్షులు గ్ఝి జిన్‌పింగ్, ఇతర సభ్య దేశాల అధినేతలు, ప్రధానమంత్రులతో నాయకులతో సమావేశం అయ్యారు. ప్రపంచ శాంతి, సుస్థిరతను ప్రోత్సహించడంలో భారత్ ఎంత అంకితభావంతో పని చేస్తోందనే విషయాన్ని వివరించారు.
ఆసియా దేశాల్లో భారత నాయకత్వ సామర్థ్యాన్ని, చైనాతో స్థిరమైన సంబంధాలను కొనసాగించగల నైపుణ్యాన్ని సుప్రసిద్ధ ప్రపంచ రాజకీయవేత్త ఇయాన్ బ్రెమ్మర్ సైతం ప్రశంసించడం గమనార్హం. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం కావడం బ్రిక్స్ సమ్మిట్‌లో చోటు చేసుకున్న కీలక పరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
దీనికి కారణం లేకపోలేదు. నాలుగు సంవత్సరాల పాటు భారత్- చైనా మధ్య కోల్డ్ వార్ సాగిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జిన్‌పింగ్‌తో మోదీ ముఖాముఖి భేటీ కావడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింద. బ్రిక్స్ వంటి అత్యున్నత వేదికపై- ప్రత్యేకించి చైనా వంటి ప్రధాన శక్తులతో తన సంబంధాలను పునరుద్ధరింపజేసుకోవడం దౌత్య నీతికి నిదర్శనం.
ఈ రెండు దేశాల ఆర్మీ కమాండర్ల మధ్య 30 రౌండ్లకు పైగా చర్చలు జరిపడం, నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిన ప్రతిష్టంభనను పరిష్కరించుకునేలా పురోగతి సాధించడం హైలైట్. అదే సమయంలో ప్రపంచ శాంతి కోసం మధ్యవర్తిత్వ పాత్ర పోషించడానికీ సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను పంపించారు మోదీ.
ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధానికి పరిష్కారం కనుగొనడంలో రష్యా, ఉక్రెయిన్, వాటికి మద్దతు పలుకుతున్న దేశాలన్నీ కూడా భారత్ వైపు చూపులు సారించాయి. సమతౌల్యంతో కూడిన దౌత్యనీతిని అనుసరిస్తోండటమే దీనికి కారణమని చెప్పడంలో సందేహాలు అక్కర్లేదు.
బద్ధ శతృవులుగా ఉంటోన్న రష్యా- ఉక్రెయిన్ రెండింటితోనూ సమాన స్థాయిలో గౌరవాన్న పొందగలిగిన ప్రపంచ నాయకుడు బహుశా మోదీ ఒక్కరే. బ్రిక్స్ సమ్మిట్‌లో మోదీ ఇరాన్‌కు చెందిన మసౌద్ పెజెష్కియాన్‌ను కూడా కలుసుకున్నారు. ప్రపంచ శాంతిని పెంపొందించడంలో దేశ అంకితభావం గురించి వివరించారు.
పాకిస్తాన్‌కు చైనా మద్దతు ఇస్తోన్న నేపథ్యంలో మోదీ తీవ్రవాదం గురించి మాట్లాడటం, ద్వంద్వ ప్రమాణాలకు స్వస్తి పలకాలంటూ హితబోధ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్‌కు పెను ముప్పుగా ఉంటో వస్తోన్న తీవ్రవాద సంస్థలు, ఇతర మిలిటెంట్ గ్రూపులకు అండదండలు అందిస్తోన్న పాకిస్తాన్‌కు మద్దతుగా ఉన్న దేశాలను ఆయన విమర్శించారు.
బ్రిక్స్ సభ్య దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది భారత్. దీనికి కారణమైన డిజిటల్ టెక్నాలజీ, సుస్థిరాభివృద్ధి, అంతర్జాతీయ దౌత్యంలో చొరవ చూపించడం భారత్‌ను ప్రత్యేకంగా నిలిపింది. ఇది- రష్యాతో తన సంబంధాన్ని బలోపేతం చేయడానికి, చైనాతో చర్చలలో పాల్గొనడానికి, ప్రపంచ పాలనా సంస్కరణల్లో కీలక పాత్ర పోషించడానికి భారత్‌కు ఓ చక్కని అవకాశాన్ని కల్పించినట్టయింది.
రష్యా, ఇతర పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా అలీన దేశంగా భారత్ తన ప్రత్యేకతను మరోసారి నిలుపుకొన్నట్టయింది. ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో మధ్యవర్తిగా వ్యవహరించడానికి వీలు కల్పించింది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర దేశాలు తమ దౌత్య విధానాలపై పునఃసమీక్షించుకుంటోన్న పరిస్థితుల్లో మోదీ రష్యాలో అడుగుపెట్టారు.
దౌత్యం, సభ్య దేశాల మధ్య ఓపెన్ డిబేట్- అన్నింటికంటే ముఖ్యంగా ఘర్షణలకు తావులేకుండా శాంతియుత పరిష్కారాలను ప్రోత్సహించడంలో హేతువాద గళాన్ని భారత్ గట్టిగా వినిపించగలిగింది. వనరులు అధికంగా ఉన్న రష్యన్ ఆర్కిటిక్, నార్తర్న్ సీ రూట్ (NSR)లో భారతదేశం పాల్గొనడం కీలక చర్చనీయాంశాలుగా మారాయి.
ఇండో-రష్యన్ కార్గో రవాణా, ఆర్కిటిక్ షిప్‌ల నిర్మాణంలో ఉమ్మడి ప్రాజెక్టులు, ధ్రువ ప్రాంత సముద్ర జలాల్లో నావిగేషన్, భారత నావికులకు మాత్రమే సాధ్యమయ్యే శిక్షణ వంటి కార్యక్రమాలు ఎన్ఎస్ఆర్‌లో చర్చకు వచ్చాయి. సభ్య దేశాల మధ్య భద్రత, తీవ్రవాద వ్యతిరేక నినాదం, ఈ రీజియన్‌లో సుస్థిరత్వపై దృష్టి సారించాయి.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మెరుగైన నిఘా భాగస్వామ్యం, ప్రాంతీయ సహకారం అత్యవసరమని, ఆసియా రీజియన్‌లో సరిహద్దుల ఉల్లంఘనలను సమష్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుందని మోదీ బ్రిక్స్ సదస్సులో పిలుపునిచ్చారు. తూర్పు- పశ్చిమాసియా దేశాల మధ్య ఒక ప్రధాన అనుసంధానకర్తగా భారత్ ఆవిర్భవించిందనే సందేశాన్ని ఇచ్చారు.
కెనడాను మినహాయించితే- వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ స్థిరత్వం, భద్రత భాగస్వామ్యం, తీవ్రవాదాన్ని అణచివేయడం, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సముద్ర జలాల భద్రత వంటి కీలక సమస్యలపై జీ7 సభ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకుని రాగలిగింది భారత్.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ మృతికి సంబంధించి తలెత్తిన వివాదాల నేపథ్యంలో కెనడాతో భారత సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. రెండు దేశాల మధ్య విద్యార్థుల ఇమ్మిగ్రేషన్, వాణిజ్య రంగాన్ని కొంతమేర ప్రభావితం చేసింది. ఏదేమైనప్పటికీ, ఇతర జీ7 దేశాలతో భారత్ తన దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోగలిగింది.
గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన గాజా వివాదం వంటి ప్రపంచం ఎదుర్కొంటోన్న ఉద్రిక్తతల మధ్య భారత్.. అత్యంత అప్రమత్తంగా, సమతౌల్యతను కొనసాగించడం దేశ వ్యూహాత్మక దౌత్య నీతికి నిదర్శనం. రెండు దేశాలు కూడా సంయమనం పాటించాల్సి ఉంటుందని, చర్చల ద్వారా శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలంటూ కుండబద్దలు కొట్టారు మోదీ.
ఇజ్రాయెల్‌తో బలమైన సంబంధాలను కొనసాగిస్తూనే పాలస్తీనాకు దీర్ఘకాల మద్దతును బ్యాలెన్సింగ్ చేయడం అనేది దేశ దౌత్య సామర్థ్యాలు, సంక్లిష్ట భౌగోళిక రాజకీయ ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటోందనేది ప్రస్ఫూటింపజేసింది. దేశం సంక్లిష్ట భౌగోళిక రాజకీయ సమస్యలను పరిష్కరించుకుంటూ బలమైన ఆర్థిక భాగస్వామ్యాలు, సాంస్కృతిక సంబంధాలను ఏర్పరచుకుంటోందనే విషయాన్ని బ్రిక్స్ సమ్మిట్ మరోసారి చాటిచెప్పింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications