ఉద్యోగం లేదని మనస్తాపం: మాల్ పైనుంచి దూకి వధువు ఆత్మహత్య

వివరాల్లోకి వెళితే.. మృతురాలు శివాని తన తల్లిదండ్రులతోపాటు జానక్‌పురిలో నివాసం ఉంటోంది. గుర్గావ్‌లోని ఓ కంపెనీ కోసం ఆమె పని చేస్తోంది. కాగా, కొన్ని రోజుల క్రితం ఆమె ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె పెళ్లికి నిరాకరించిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
శనివారం రాత్రి ఆమెకు నిశ్చితార్థం జరిగింది. రాత్రి 11.30గంటల ప్రాంతంలో ఆమె తల్లిదండ్రులు, బంధువులు అతిథులతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఆమె ఫంక్షన్ హాల్లోని ఓ మాల్ పైకి ఎక్కింది. ఆ తర్వాత అక్కడ్నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఓ ప్రైవేటు యూనివర్సిటీ నుంచి ఎంబిఏ పూర్తి చేసిన తమ కూతురు, వెంటనే ఉద్యోగం లభించడంతో చేరిపోయిందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. సింగపూర్‌కు చెందిన ఓ ఇంజినీర్‌తో ఆమెకు వివాహం నిశ్చయించామని, నిశ్చితార్థం కూడా చేశామని తెలిపారు.
అయితే పెళ్లి చేసుకోవడానికి ఆమె అంగీకరించలేదని చెప్పారు. ఉద్యోగం సంపాదించిన తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పినా.. శివాని మాటలను తల్లిదండ్రులు పట్టించుకోలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications