వచ్చాడు దొరికాడు!బీఎస్ఎఫ్ జవాన్ల అదుపులో పాక్ రేంజర్
జమ్మూకాశ్మీర్‌లోని ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా బలగాలు టెర్రరిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసిన బలగాలు.. ఉగ్రవాదులకు సహకరించిన పలువురు అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నారు. ఇ క్రమంలోనే భారత్ సరిహద్దులోకి చొరబడిన ఓ పాకిస్థాన్ రేంజర్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్ రేంజర్ భారత్‌లోకి ప్రవేశించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఇటీవల అనుకోకుండా భారత్ సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన ఓ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను పాక్ ఆర్మీ నిర్భంధించిన విషయం తెలిసిందే. అతడ్ని విడుదల చేయాలని భారత సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు.

ఉన్నతాధికారుల అనుమతి లేనిదే భారత సైనికుడ్ని విడుదల చేయడం కుదరదని పాక్ ఆర్మీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఈ సమయంలో పాక్ రేంజర్‌ను భారత్‌లోకి ప్రవేశించడం, బీఎస్ఎఫ్ జవాన్లకు చిక్కడం కీలక పరిణామంగా మారనున్నట్లు తెలుస్తోంది. మన జవాన్‌ను వదిలితే గానీ. పాక్ రేంజర్‌ను మనం వదిలిపెట్టే అవకాశం లేనట్లుగానే తెలుస్తోంది.
కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు తీసిన విషయం విధితమే. ఉగ్రదాడులు అనంతరం భద్రతా బలగాలు ఉగ్రవాదుల వేటను తీవ్రతరం చేశాయి. సరిహద్దు ప్రాంతాలతోపాు జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నారు.
పలువురు ఉగ్రవాదులకు సంబంధించిన నివాసాలను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఉగ్రవాదులకు సహకరించిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడులకు పాల్పడ్డారు. ఏప్రిల్ 15నే పహల్గాం చేరుకున్న ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నారు.
బైసరన్ వ్యాలీ ప్రాంతం తమకు అనుకూలంగా ఉండటంతో ఇక్కడే పర్యాటకులపై దాడులకు పాల్పడ్డారని విచారణలో భద్రతా బలగాలు తెలుసుకున్నాయి. ఉగ్రవాదులకు స్థానికులు కొంతమంది సహరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు, పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి అయిన పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటోంది భారత్. తాజాగా, ఆ దేశానికి ఎగుమతులు, దిగుమతులు రద్దు చేసి భారీ షాకిచ్చింది.












Click it and Unblock the Notifications