కొత్త ఆట మొదలుపెట్టిన అప్ప, సంతోష్ వర్గానికి షాక్, తెర మీదకు మేడమ్ పేరు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 50 రోజులు గడుస్తున్నా బీజేపీ ప్రతిపక్ష నేతను ఎన్నుకోలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం ముగిసినప్పటికీ కొత్త అధ్యక్షుడిని నియమించలేదనే ఆరోపణలు బీజేపీ హైకమాండ్ ఎదుర్కొంటున్నది. ప్రతిపక్ష నేత లేకుండా కర్ణాటక శాసన సభా కార్యక్రమాలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి అని కాంగ్రెస్ విమర్శించింది.
ఈ పరిణామాల మధ్య ప్రతిపక్ష నేత, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను బీజేపీ కొనసాగించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చాలా మంది నాయకులు పోటీపడుతున్నారు. అయితే ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే పేరు తెరపైకి రావడంతో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పకు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చాలా సన్నిహితురాలు కావడంతో ఆయన ఆమె పేరును బీజేపీ హైకమాండ్‌కు సూచించినట్లు సమాచారం.

లింగాయత్ సామాజికవర్గానికి చెందిన లీడర్ ను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేస్తే కుల సమీకరణాలను భర్తీ చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఒక్కలిగ వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కలిగ సామాజికవర్గానికి చెందిన శోభా కరంద్లాజే పేరును బీఎస్ యడియూరప్ప బీజేపీ హైకమాండ్ కు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా ఉన్న శోభా కరంద్లాజే మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలు. అయితే శోభా కరంద్లాజే గత కొన్నేళ్లుగా జాతీయ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే శోభా కరంద్లాజేను మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా తన ఆధిపత్యాన్ని మళ్లీ కొనసాగించాలని బీఎస్. యడ్యూరప్ప భావిస్తున్నట్లు సమాచారం.

పాత మైసూర్‌లో ఓటమి పాలైనప్పటికీ బీజేపీ ఓట్ల శాతాన్ని పెంచుకుంది. దక్షిణ కర్ణాటకలో పార్టీని ఎదగాలంటే ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పెద్దపీట వేయాలన్నది ఆ పార్టీలోనే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఒక్కలిగ నేతలు పార్టీ అధ్యక్ష పదవిపై కన్నేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, బెంగళూరులోని మల్లేశ్వరం ఎమ్మెల్యే డాక్టర్ సీఎన్ అశ్వత్థానారాయణ, పద్మనాభనగర్ ఎమ్మెల్యే ఆర్. అశోక్‌లు పోటీ పడుతున్నారు.
వీరంతా ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు. ఇప్పుడు శోభా కరంద్లాజే పేరు తెరపైకి వచ్చి అందరినీ షాక్‌కి గురి చేసిందని అంటున్నారు. బీజేపీ జాతీయ జనరల్ (ఆర్గనైజింగ్) సెక్రటరీ బిఎల్ సంతోష్ వర్గంలో గుర్తింపు తెచ్చుకున్న సీటీ. రవి, డాక్టర్ సిఎన్ అశ్వత్థనారాయణకు దెబ్బకు షాక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ యడియూరప్ప కొత్త గేమ్‌కు తెరలేపారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications