మధ్యంతర బడ్జెట్: చెప్పాలనుకున్నది చెప్పేశారు.. గంటలోపే ముగించేసిన నిర్మల సీతారామన్..!
Budget 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. అందులో పొందుపరిచిన అంశాలను చదివి వినిపించారు.
ఎప్పట్లాగే ఈ బడ్జెట్‌లో కూడా దేశ రక్షణకే అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచారు. గతంతో పోల్చుకుంటే 3.4. శాతం మేర అధికంగా కేటాయింపులు చేశారు. దీని మొత్తం 11,11,111 లక్షల కోట్ల రూపాయలు. మొత్తంగా బడ్జెట్ ప్రతిపాదనల్లో 11.1 శాతం మేర కేటాయింపులు రక్షణ మంత్రిత్వ శాఖకే జరిగాయి.

దేశ రక్షణ రంగాన్ని మరింత ఆధునికీకరిస్తామని ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ హామీ ఇచ్చారు. జై జవాన్, జై కిసాన్‌తో అనే నినాదాలతో పాటు జై విజ్ఞాన్, జై అనుసంధాన్ (రీసెర్చ్) అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే రక్షణ శాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో టాప్ ప్రయారిటీ ఇచ్చామని పేర్కొన్నారు.
రక్షణ రంగ వ్యవస్థ బాగుంటేనే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని తాము బలంగా విశ్వసిస్తోన్నామని నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. మున్ముందు ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదనే సంకేతాలను పంపించారు. జీడీపీలో రక్షణరంగం వాటాను మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
10 సంవత్సరాల కాలంలో దేశ ప్రజల సగటు ఆదాయం ఏకంగా 50 శాతం మేర పెరిగిందని నిర్మల సీతారామన్ అన్నారు. ఈ పదేళ్ల కాలంలో 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించామని నిర్మల సీతారామన్ చెప్పారు. పేదల సంక్షేమమే దేశ సంక్షేమంగా అభివర్ణించారామె.
కాగా- ఈ మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మల సీతారామన్.. గంటలోపే ముగించేశారు. బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి మెరుపులూ మెరిపించలేదు. గతం కంటే భిన్నంగా సాగిందామె ప్రసంగం. ఇదివరకట్లా ఎలాంటి సూక్తులనూ వినిపించలేదు. హితబోధనలూ చేయలేదు. చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేశారు.
ఈ ఏడాది జులైలో మళ్లీ తమ ప్రభుత్వమే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందనే ధీమాను నిర్మల సీతారామన్ వ్యక్తం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి ఘన విజయం సాధిస్తుందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. ఆమె ప్రసంగం ముగిసిన వెంటనే సభ శుక్రవారానికి వాయిదా పడింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications