Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్యాక్స్ పేయర్స్ కోసం కొత్త పథకం: కోటి మంది మధ్య తరగతి జీవులకు ఊరట ఇచ్చాం: మోదీ

Budget 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. అందులో పొందుపరిచిన అంశాలను చదివి వినిపించారు.

ఈ మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మల సీతారామన్.. గంటలోపే ముగించారు. బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి మెరుపులూ మెరిపించలేదు. గతం కంటే భిన్నంగా సాగిందామె ప్రసంగం. ఇదివరకట్లా ఎలాంటి సూక్తులనూ వినిపించలేదు. హితబోధనలూ చేయలేదు. చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేశారు.

Budget 2024: Here what PM Modi says on interim Budget

ఈ బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ మేరకు ఓ వీడియో క్లిప్‌ను ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఇందులో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు మోదీ. ఈ బడ్జెట్ వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయన్నది వివరించారు.

ఈ బడ్జెట్‌లో కొత్తా ఇన్‌కమ్ ట్యాక్స్ రెమిషన్ స్కీమ్‌ను ప్రకటించామని మోదీ తెలిపారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కోటి మంది మధ్య తరగతి కుటుంబీకులకు ఉపశమనాన్ని కల్పించామని అన్నారు. గత ప్రభుత్వాలేవీ ఇలాంటి పథకం అమలు గురించి కనీసం ఆలోచన కూడా చేయలేకపోయాయని చెప్పారు.

గత ప్రభుత్వాల హయాంలో సామాన్య ప్రజల మెడపై పన్నుల కత్తి వేలాడుతుండేదని, ఇప్పుడు అలాంటి దుర్గతి నుంచి కోటి మంది మధ్య తరగతి కుటుంబీకులను విముక్తి కల్పించామని మోదీ చెప్పారు. రైతుల కోసం కూడా ఆ బడ్జెట్‌లో అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నామని తెలిపారు.

నానో డీఏపీ, మూగజీవాల కోసం కొత్త పథకాన్ని ప్రకటించామని గుర్తు చేశారు. పీఎం మత్స్యసంపద పథకాన్ని మరింత విస్తరింపజేశామని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ అభియాన్ వంటి పథకాల వల్ల రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని, పంట వ్యయం తగ్గుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+