కాంతార సినిమా ఎద్దుల దెబ్బకు ఖేల్ ఖతం, గోల్డ్ మెడల్ ఎత్తుకుపోయిన కాంతార జంట !

బెంగళూరు: ఐటీ హబ్ బెంగుళూరులో తొలిసారిగా జరిగిన కంబళ పోటీలకు తెర పడింది. శనివారం, ఆదివారాల్లో బెంగుళూరు వాసులు కోస్తా కర్ణాటకలో ప్రసిద్ధ క్రీడ అయిన కంబళ క్రీడలు తిలకించి ఆ మూడ్ లో మునిగిపోయారు. కర్ణాటక సముద్ర తీరప్రాంత వంటకాలను బెంగళూరు ప్రజలు రెండు రోజుల పాటు రుచి చూశారు. రెండు రోజుల పాటు బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో కంబళ క్రీడా పోటీల్లో సుమారు 200 జతల ఎద్దులు పాల్గొన్నాయి.

కంబళ ఎద్దుల పోటీల కార్యక్రమం చివరి రోజు అయిన ఆదివారం బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో కాంతార సినిమాలో రిషబ్ శెట్టి నడిపిన ఎద్దులు( కోనలు) బంగారు పతకం ( స్వర్ణం) గెలుచుకున్నాయి. కంబళ ఎద్దుల పోటీలు ఆరు విభాగాల్లో నిర్వహించగా ఒక విభాగంలో కాంతార సినిమాలో ఉన్న జోడెద్దులు బంగారు పతకం సాధించుకున్నాయి. కాంతార సినిమాలో ఉన్న జంట ఎద్దులు అప్పు, కుట్టిల జంట కంబళ పోటీల్లో పాల్గొన్న మిగిలిన ఎద్దులకు గట్టిపోటీని ఇచ్చాయి.

bulls of Kantara movie won the gold medal in the Kambala bull competition held at Bengaluru Palace Grounds

155 మీటర్ల ట్రాక్‌లో పరుగెత్తుకుంటూ 6 అడుగుల వరకు నీటిని చిమ్మిన కాంతార సినిమాలో నటించిన ఎద్దులు టైటిల్‌ తో పాటు బంగారు పతకం గెలుచుకున్నాయి. కర్ణాటకలోని బోలంబల్లి పరమేశ్వర భట్‌కు చెందిన ఎద్దులు బంగారు పతం దక్కించుకున్నాయి. బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంబళ ట్రాక్ లో మూడు విభాగాల్లో ఎద్దుల పోటీలు (కంబళ) నిర్వహించారు. నీటి బురదలో జోడెద్దులు పోటీపడి బెంగళూరు ప్రజలను కట్టిపడేశాయి.

కంబళ పోటీల్లో పాల్గొన్నా మా ఎద్దుల సత్తా చూడటానికి కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టి రావాలని బోలంపల్లి పరమేశ్వర భట్ కోరాడు. కాంతార సినిమాలో ఆ ఎద్దులను హీరో రిష్ శెట్టి నడిపాడు. కాంతార సినిమా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంబళ ఎద్దుల పోటీలు పాపులర్ కావడానికి, తన జోడెద్దులు మంచిపేరు తెచ్చుకోవడానికి ఆ సినిమా హీరో రిషబ్ శెట్టి కారణం అయ్యారని ఆ ఎద్దుల యజమాని పరమేశ్వర్ భట్ అభిప్రాయపడ్డారు.

బెంగళూరులో నిర్వహించిన కంబళ ఎద్దుల పోటీలకు శనివారం 2. 30 లక్షల మందికి పైగా ప్రజలు తరలివచ్చారు. ఆదివారం సుమారు 4. 50 లక్షల మంది బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కంబళ ఎద్దుల పోటీలను ప్రత్యక్షంగా చూశారు. ఇదే సమయంలో ఉత్తర కన్నడ, ఉడిపి, దక్షిణ కన్నడతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి బెంగళూరు వచ్చిన ప్రజల సంఖ్య ఆదివారంరెట్టింపు అయ్యింది.

కంబాళ క్రీడలను చూసేందుకు సినీ నటులు, కన్నడన రియల్ హీరో ఉపేంద్ర, రక్షిత్ శెట్టి, పూజా హెడ్గే, రమేష్ అరవింద్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కూడా బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ చేరుకున్నారు. నాలుగు లక్షల మందికి పైగా జనాన్ని అదుపు చేసేందుకు కంబళ క్రీడాపోటీలు నిర్వహించిన నిర్వమకులు, వాలంటీర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది. బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కంబళ క్రీడాపోటీలకు ప్రవేశం ఉచితం అయినప్పటికీ అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ లో విక్రమయించిన ఆహారం, సీతలపానీయాల, నీళ్ల ధరలు, పార్కింగ్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని బెంగళూరు ప్రజలు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+