Bina Tiwari: ఎవరీ బీనా తివారీ.. ఆనంద్ మహీంద్రా ఎందుకు ట్వీట్ చేశారు..!
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఓ ఆర్మీ డాక్టర్ కు సంబంధించి ట్వీట్ చేశాడు
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో టర్కీలో భూకంపం తర్వాత భారత బలగాలు చేపట్టిన ప్రయత్నాలను హైలైట్ చేశారు. అక్కడ పిల్లలలో రక్షించిన భారతీయ ఆర్మీ డాక్టర్ ఫోటోను ట్విట్టర్ లోషేరు చేశారు. ఈ చిత్రం "భారతదేశం ప్రపంచ చిత్రం"గా ఉండాలని పారిశ్రామికవేత్త అన్నారు. ఆ ఫొటోలో భారత ఆర్మీ డాక్టర్, భూ కంపం నుంచి బయటడిన బాలిక ఉన్నారు.
ఇస్కెందరున్
"ఇస్కెందరున్‌లో టర్కీ భూకంప బాధితుల కోసం భారత సైన్యం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో బాధిత బాలికతో మేజర్ బీనా తివారీ ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాలలో ఒకటి మనది. రెస్క్యూ, శాంతి పరిరక్షక కార్యకలాపాలలో వారికి దశాబ్దాల అనుభవం ఉంది. ఇది ప్రపంచమంతటా చేయగలదు. ఇది భారతదేశ చిత్రం" అని మహీంద్రా ట్వీట్ చేశారు.
బీనా తివారీ సోదరుడు
ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు బీనా తివారీ సోదరుడు స్పందించాడు. ఆమె నా సోదరి.. ఆమెను గుర్తించినందుకు ధన్యవాదాలు. ఆమె టర్కీలో భారత్ టీంతో కలిసి పని చేస్తున్నారని అన్నారు. దీనికి స్పందించిన ఆనంద్.. "మీ కుటుంబం సైన్యంలో వారసత్వంగా పని చేస్తుండడం మేమంతా గర్విస్తున్నాము. దయచేసి మీ సోదరికి నా వ్యక్తిగత గర్వం కృతజ్ఞతలు తెలియజేయండి" అని రిప్లే ఇచ్చాడు.
దేహ్రాడూన్
ఆర్మీ డాక్టర్ బీనా స్వస్థలం దేహ్రాడూన్. ఆమె ఢిల్లీలోని ఆర్మీ కాలేజ్‌లో వైద్యవిద్యను అభ్యసించారు. దేశం కోసం సేవలు అందించడం ఆమె కుటుంబానికి కొత్తేం కాదు. ఆమె తాత ఆర్మీలో సుబేదార్‌గా పనిచేయగా.. తండ్రి 16 కుమావ్ పదాతిదళంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త కూడా వైద్యుడే. ప్రస్తుతం ఆమె కల్నల్ యదువీర్ సింగ్ ఆధ్వర్యంలో అస్సాంలో పనిచేస్తున్నారు.

35,000 మంది మృతి
కాగా టర్కీలో భూకంపం దాటికి మృతి చెందిన వారి సంఖ్య 35,000 మందికి చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. టర్కీలో 1939లో దాదాపు 33,000 మంది మరణించారు. ఫిబ్రవరి 6న తెల్లవారుజామున టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి భవనాలన్నీ కూలిపోయాయి. వెంటనే స్పందించిన భారత్ ఆ దేశంతో ఉన్న విభేదాలు పక్కకు పెట్టి భారత్ బృందాలను టర్కీకి పంపించింది.












Click it and Unblock the Notifications