కలకలం: ఢిల్లీలో తెలుగు విద్యార్థి కిడ్నాప్, 5 కోట్లు డిమాండ్
దేశ రాజధాని ఢిల్లీలో ఓ తెలుగు విద్యార్థి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. కిడ్నాపర్ రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. డబ్బు చెల్లిస్తేనే ఆ విద్యార్థిని వదిలేస్తామంటూ బెదిరింపులకు దిగాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ తెలుగు విద్యార్థి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. కిడ్నాపర్ రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. డబ్బు చెల్లిస్తేనే ఆ విద్యార్థిని వదిలేస్తామంటూ బెదిరింపులకు దిగాడు.
వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో నివాసం ఉంటూ మెట్రో మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. ఇతడిని ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. గురువారం రాత్రి కారులో వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అనంతరం కిడ్నాపర్ అతడు చదువుకుంటున్న కాలేజీకి ఫోన్ చేయడంతో కిడ్నాప్ విషయం వెలుగులోకి వచ్చింది. అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, రూ.5 కోట్లు ఇస్తేనే శ్రీనివాస్ గౌడ్ ను వదిలేస్తామంటూ బెదిరించాడు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ప్రీతివిహార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యుల నుంచి ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు శ్రీనివాస్ గౌడ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. తమ కుమారుడిని కాపాడమంటూ శ్రీనివాస్ గౌడ్ తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications