ఏఎంయూ ఘర్షణలు: 10వేల మంది విద్యార్థులపై కేసు నమోదు

లక్నో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా గత కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలకు, ఆందోళనలకు సంబంధించి 10వేల మంది విద్యార్థులపై పోలీసు కేసు నమోదు చేశారు.

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 15న అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఢిల్లీలోని జామియా మిలీయా ఇస్లామియా వర్సిటీలో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడాన్ని నిరసిస్తూ వీరంతా భారీ ఎత్తున ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.

Case registered against 10,000 students in connection with AMU violence

ఈ క్రమంలో విద్యార్థులు పలువురు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విద్యార్థులపై తాజాగా కేసు నమోదు చేశారు. ఘర్షణలు ఎక్కువగా ఉండటంతో డిసెంబర్ 15 నుంచి ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ఆ తర్వాత మళ్లీ పునరుద్ధరించారు. ఇప్పటికే ఘర్షణలకు సంబంధమున్న 26 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

కాగా, ఆందోళనల పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రజల ఆస్తులు ధ్వంసం చేసినందుకు గానూ నష్ట పరిహారం చెల్లించాలంటూ పలువురు నోటీసులు కూడా జారీ చేసింది యూపీ సర్కారు. కొందరు నష్ట పరిహారం కూడా కొందరు చెల్లించినట్లు తెలుస్తోంది.

సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామీయా మిలీయా విశ్వవిద్యాలయంతోపాటు దేశంలోని పలు వర్సిటీల విద్యార్థులు కూడా ఆందోళనలకు దిగారు. అయితే, ఢిల్లీ, ఉత్తరప్రదేశ రాష్ట్రాల్లో ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కూడా ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఐదు రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టడంతోపాటు ఓ రైలుకు కూడా తగలబెట్టారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో హింసను, వేధింపులు ఎదుర్కొని అక్కడ బతకలేని పరిస్థితుల్లో మనదేశానికి వచ్చిన మైనార్టీలకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం జరుగుతుంది. 2014కు ముందు వచ్చిన శరణార్థులకు మాత్రమే మన దేశ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+