ఒడిశా రైలు ప్రమాదంపై చర్యలు- ముగ్గురు రైల్వే అధికారుల్ని అరెస్టు చేసిన సీబీఐ..
ఒడిశాలో గత నెలలో చోటు చేసుకున్న కోరమాండల్, హౌరా, గూడ్స్ రైళ్ల ఢీ ప్రమాదంలో కుట్రకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఇవాళ ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్టు చేసింది. వీరి తప్పిదం కారణంగానే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుని దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సీబీఐ గుర్తించింది. దీంతో సామూహిక జననానికి పాల్పడినట్లు వీరిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇప్పటికే రైల్వే భద్రతా కమిషన్ కూడా మానవతప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తేల్చింది.
సీబీఐ అరెస్టు చేసిన రైల్వే ఉద్యోగుల్లో.. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మొహమ్మద్ అమీర్ ఖాన్, సాంకేతిక నిపుణుడు పప్పు కుమార్ ఉన్నారు. బాలాసోర్ సమీపంలో జూన్ 2న జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషన్ దర్యాప్తు గత హెచ్చరికలను విస్మరించకపోతే ఈ విషాదాన్ని నివారించి ఉండొచ్చని గుర్తించింది. లెవెల్-క్రాసింగ్ లొకేషన్ బాక్స్‌లోని వైర్లు తప్పుగా అమర్చారని, ఈ విషయాన్ని సంవత్సరాల తరబడి గుర్తించలేదని కూడా తేల్చింది. ఇదే ఆరోజు గందరగోళానికి దారితీసిందని నివేదిక గుర్తించింది.

ఒడిశాలో రైలు ప్రమాదానికి సిగ్నలింగ్, ఆపరేషన్స్ రెండు శాఖలు బాధ్యులని సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. మెయింటెనెన్స్ పని పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిగ్నలింగ్ సిస్టమ్ లైవ్‌లో ఉందని, అంటే సిగ్నలింగ్ మెయింటెయినర్ "రీకనెక్షన్ మెమో" జారీ చేసినట్లు దర్యాప్తులో తేలిందని రైల్వే బోర్డు వర్గాలు తెలిపాయి. అలాగే రైలును అనుమతించే ముందు సిగ్నలింగ్ వ్యవస్థను పరీక్షించే భద్రతా ప్రోటోకాల్‌ను పాటించలేదని వెల్లడించాయి.
ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు జరిపిన రైల్వేశాఖ ఇది పూర్తిగా మానవ తప్పిదంగా గుర్తించడంతో పాటు గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సరిదిద్దుకోకపోవడం వల్లే ఇది పునరావృతం అయినట్లు తెలిపింది. అలాగే దర్యాప్తులో సీబీఐ కూడా ఎలాంటి ముందస్తు కుట్ర కోణాన్ని గుర్తించలేదు. ఈ నేపథ్యంలో సిగ్నలింగ్ వ్యవస్ధలో లోపాలకు కారణమైన ఉద్యోగుల్ని సీబీఐ ఇవాళ అరెస్టు చేసింది. వీరిని రేపు కోర్టులో హాజరుపర్చే అవకాశముంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications