CBSE Class 12 results: ఫలితాలు వచ్చేశాయ్: ఈ సారి కీలక మార్పులు: నో ర్యాంక్స్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. సీబీఎస్ఈ బోర్డ్ కొద్దిసేపటి కిందటే వీటిని విడుదల చేసింది. ఈ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌లో పొందుపరిచింది. సీబీఎస్ఈకి చెందిన https://testservices.nic.in/cbseresults/class_xii_2023/ClassTwelfth_c_2023.htm లింక్‌లో పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

దీనితో పాటు results.cbse.nic.in, cbseresults.nic.in వెబ్‌సైట్ల ద్వారా కూడా విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు. దీనికి అదనంగా డిజిలాకర్, ఉమంగ్ యాప్‌ను ఓపెన్ చేయడం ద్వారా కూడా విద్యార్థులు పరీక్ష ఫలితాలను తెలుసుకునే వెసలుబాటు కల్పించింది సీబీఎస్ఈ బోర్డ్. డిజిలాకర్ లింక్ digilocker.gov.in.

 cbse

డిజిలాకర్‌ ద్వారా తెలుసుకోవాలంటే విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ నంబర్, పుట్టినతేదీ వివరాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్), ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తంగా 16,96,770 మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రాశారు. 87.33 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఈ పరీక్షల ఫలితాల్లో- కేరళ రాజధాని తిరువనంతపురం రీజియన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రీజియన్‌ 99.91 శాతం ఫలితాలను సాధించింది. దాదాపుగా పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించినట్టయింది తిరువనంతపురం రీజియన్‌లో. రెండో స్థానంలో మహారాష్ట్రలోని పుణే రీజియన్ నిలిచింది. 87.28 శాతం ఉత్తీర్ణత ఇక్కడ రికార్డయింది.

పరీక్షలు రాసిన వారిలో 1.36 శాతం విద్యార్థులు మాత్రమే 95 శాతానికి పైగా మార్కులను సాధించారు. ఇక 90కి పైగా మార్కులను సాధించిన వారి శాతం 6.80గా రికార్డయింది. మొత్తంగా బాలుర కంటే బాలికల హవా కనిపించింది. బాలుర కంటే 6.01 శాతం బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు.

ఈ సారి సీబీఎస్ఈ కీలక మార్పులు చేసింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ డివిజన్లను ప్రకటించలేదు. విద్యార్థుల మధ్య అనారోగ్యకర పోటీ ఏర్పడుతుందనే కారణంతో ఫస్ట్, సెకెండ్, థర్డ్ డివిజన్స్‌ను వెల్లడించలేదు. ఈ తరహా అనారోగ్యకర వాతావరణం ఎప్పటికీ మంచిది కాదని భావించడం వల్లే ఈ సవరణలు చేసినట్లు సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. ఇక మీదట ఇదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+