వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10, 12వ తరగతి సీబీఎస్ఈ టర్మ్-2 బోర్డ్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి, ఆఫ్‌లైన్ మోడ్‌లోనే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)10, 12వ తరగతుల విద్యార్థులకు టర్మ్-2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలన్నీ ఆఫ్‌లైన్ మోడ్‌లోనే నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ వెల్లడించారు.

ఈ పరీక్షల నిర్వహణఫై రాష్ట్రాలతో చర్చించిన తర్వాత దేశంలోని కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సెకండ్ టర్మ్ పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే నిర్వహించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు. థియరీ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయని, 10, 12వ తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.

 CBSE Term-2 Board Exams For Class 10, 12 To Start From April 26 In Offline Mode.

బోర్డ్ వెబ్‌సైట్‌లో ఉంచిన శాంపిల్ క్వశ్చన్ పేపర్ల మాదిరిగానే పరీక్షల ప్రశ్నాపత్రం ప్యాట్రన్ ఉంటుందని ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ తెలిపారు. కాగా, కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం కేంద్ర మాధ్యమిక విద్యా మండలి గత జులై 5న ప్రత్యేక మదింపు విధానాన్ని ప్రకటించింది.

అకాడమకి్ సెషన్ ను రెండు భాగాలుగా విభజించి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. టర్మ్-1 పరీక్షలను గత ఏడాది నవంబర్-డిసెంబర్‌లో, టర్మ్-2 పరీక్షలను 2022 మార్చి-ఏప్రిల్ నెలలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే టర్మ్-1 పరీక్షలు నిర్వహించిన బోర్డ్, టర్మ్-2 పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి నిర్వహించనున్నట్లు బుధవారం సీబీఎస్ఈ ప్రకటించింది.

English summary
CBSE Term-2 Board Exams For Class 10, 12 To Start From April 26 In Offline Mode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X