గూగుల్‌కు రూ. 136కోట్ల భారీ జరిమానా విధించిన సీసీఐ
న్యూఢిల్లీ: ప్రఖ్యాత సెర్చింజన్ సంస్థ గూగుల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది. గూగుల్‌కు భారత్ రూ. 136 కోట్ల జరిమానా విధించింది. ఇతర పోటీదారులు, వినియోగదారులకు నష్టం చేకూర్చేలా గూగుల్ ప్రవర్తించినట్లు సీసీఐ పేర్కొంది.
గూగుల్‌పై అనుచిత వ్యాపార ధోరణుల కేసు 2012లో దాఖలయింది. కాగా, గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెల్ కంపెనీ వెబ్‌సెర్చ్‌లో, అడ్వర్టెయిజ్‌మెంట్స్‌లో పైచేయి సాధించేందుకు యత్నించినట్లు తెలిపింది.

దీనివల్ల పోటీ సంస్థలు, యూజర్లు నష్టపోయారని చెప్పింది. అందుకే ఈ జరిమానా విధించినట్లు వెల్లడించింది. అరవై రోజుల్లోగా గూగుల్ జరిమానాను చెల్లించాల్సివుంటుందని చెప్పింది.
కేసును అన్ని కోణాల నుంచి సునిశితంగా పరిశీలించిన తర్వాతే జరిమానా విధింపు నిర్ణయం తీసుకున్నట్టు సీసీఐ వివరించింది. కాగా, ఇలాంటి అభియోగంపై గూగుల్ జరిమానా భరించాల్సివచ్చిన అరుదైన కేసు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications