జనాభా గణనకు కేంద్రం నోటిఫికేషన్ - రెండు విడతల్లో రాష్ట్రాల వారీగా ఇలా..!

దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇప్పటికే తీసుకున్న కేబినెట్ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా జన గణనలోనే భాగంగా కుల గణన కూడా చేపట్టనున్నారు. దేశంలో రెండు విడతలుగా ఈ జనాభా గణన ప్రక్రియ చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో జన గణన మొదలు కానుండగా.. మిగతా రాష్ట్రాల్లో 2027లో ఈ ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

దేశంలో చేపట్టే జనగణన ముందుగా వచ్చే ఏడాది అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చేపడతారు. అలాగే 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టబోతున్నారు. అలాగే ప్రతీ రాష్ట్రంలోనూ రెండు దశల్లో జనాభా గణన చేపడతారు. నిన్న జనగణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ తో ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఇందులో ఈ తేదీల్ని ఖరారు చేశారు.

centre issued notification for census in two phases from next year- here are details

జనాభా గణనలో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ముందుగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేపడతారు. ఇందులో ప్రతి ఇంటి గృహ పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాల గురించి సమాచారం సేకరిస్తారు. అనంతరం రెండవ దశలో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తి యొక్క జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక వివరాలను సేకరిస్తారు. ఈ దశలో ఒక వ్యక్తి యొక్క కులం గురించి సమాచారం కూడా తీసుకుంటారు. దేశంలో సుదీర్ఘ విరామం తర్వాత ఇలా జనాభా గణనలో కుల గణనను కూడా చేపట్టబోతున్నారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+