కాంగ్రెస్ పై మోదీ ఆపరేషన్ 'థరూర్'- రాహుల్ టీం గగ్గోలు..!!

ఆపరేషన్ సింధూర్ సక్సస్ అయింది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆపరేషన్ 'థరూర్' ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ .. ట్రంప్ జోక్యం పైన కాంగ్రెస్ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో పాకిస్థాన్ ఏ విధంగా భారత్ పైన ఉగ్రవాదులను ఉసిగొల్పుతుందో వివ రిస్తూ ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో కాంగ్రెస్ నుంచి పేర్లు సూచించాలని కోరింది. కాగా, కాంగ్రెస్ సూచించిన పేర్లు కాకుండా అనూహ్యంగా టీంలో శశిథరూర్ పేరు ప్రకటించి భారీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు జాతీయ రాజకీయా ల్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

థరూర్ పేరు ఎంపికతో
భారత్ పైన ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేసేలా ప్రధాని మోదీ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా పాక్ ఉగ్రవాదులకు ఇస్తున్న మద్దతు.. కుట్రలను ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పా టు చేసింది. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ కనిపించింది. ఈ బృందాలకు ఏడుగురు ఎంపీలు నాయ కత్వం వహించనుండగా, వారిలో కాంగ్రెస్ సీనియర్​ నేత శశిథరూర్ కూడా ఉన్నారు. కాగా, కేంద్రం కోరిన తరువాత కాంగ్రెస్ తమ నేతల పేర్లు సూచించింది. అందులో లేకపోయినా కేంద్రం శశి థరూర్ పేరును ఈ జాబితాలో చేర్చింది. కాగా.. శశి థరూర్ తనకు వచ్చిన అవకాశం పైన కేంద్రానికి ధన్యవాదాలు చెప్పటం కాంగ్రెస్ కు అంతు చిక్కటం లేదు.

centre-picks-tharoor-to-lead-a-delegation-on-operation-sindoor-leads-to-political-rift

కేంద్రం సూచనతో
భారత్ పంపే అఖిలపక్ష బృందాల కోసం పేర్లు సూచించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్​ రిజుజు మే 16న కాంగ్రెస్​ పార్టీని కోరారు. దీంతో అదే రోజున రాహుల్ గాంధీ తమ పార్టీ తరఫున నాలుగు పేర్లను సూచించారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్​ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్​ సయ్యద్​ నజీర్​ హుస్సేన్​, లోక్​సభ ఎంపీ రాజా బ్రార్​, లోక్​సభ ఐఎన్​సీ డిప్యూటీ లీడర్​ గౌరవ్​ గొగోయ్​ ఉన్నారు.కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వీరెవరి పేర్లూ లేవు. కేరళ తిరువనం తపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్​ ఓ బృందాన్ని లీడ్ చేస్తారని కేంద్రం ప్రకటన తో కాంగ్రెస్ షాక్ అయింది. దీని పై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్​ ఎక్స్​ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, ఇందుకు భిన్నంగా శశి థరూర్ స్పందించారు.

Take a Poll

ఛాన్స్ దక్కింది వీరికే
కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, రవిశంకర్​ ప్రసాద్​ (బీజేపీ), సంజయ్​ కుమార్​ ఝా (జేడీయూ), బైజయంత్ పాండా (బీజేపీ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్​సీపీ (ఎస్పీ)), శ్రీకాంత్​ ఏక్​నాథ్ శిందే​ (శివసేన), శశిథరూర్​ (కాంగ్రెస్​) ఉన్నారు. వీరు ఆయా బృందాలకు నాయకత్వం వహిస్తారు. కేంద్రం పంపనున్న అఖిలపక్ష బృందాల్లో తనకు చోటు కల్పించడంపై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. ప్రభుత్వ ఆహ్వానాన్ని తాను మన్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, కొంత కాలంగా శశి థరూర్ ప్రధాని నిర్ణయాలను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయ న బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు తాజా పరిణామాలతో శశి థరూర్ రాజకీయ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+