బీజేపీ లోకి వచ్చేందుకు వారు సిద్దం, అక్కడే అసలు ట్విస్ట్..!!

తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ నాయకత్వం తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్ చేసింది. కేంద్ర మంత్రులు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పార్టీలో చేరికల పైనా కార్యాచరణ ఖరారు చేసారు. ఇదే సమయంలో అసలైన ట్విస్ట్ లు తెర మీదకు వస్తున్నాయి.

తెలంగాణ పైన బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా గురి పెట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంపు పైన కార్యాచరణ సిద్దం చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసేందుకు కేంద్ర మంత్రులు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పార్టీ నేతలతో పాటుగా మేధావులు.. తటస్థులు.. ప్రధాన వర్గాలతో భేటీ అవుతున్నారు. వారితో మమేకం అవుతూ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికల పైనా కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇదే అంశం పైన బీజేపీ ముఖ్య నేత జేపీ పడ్డా పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. బీజేపీ డోర్స్ ఓపెన్ చేయండి..చాలా మంది బయట వెయింటింగ్ లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారాయి.

కాంగ్రెస్ సర్వేలో ఏం తేలింది- BRS కు వచ్చే సీట్లు ఎన్ని..!?
కాంగ్రెస్ సర్వేలో ఏం తేలింది- BRS కు వచ్చే సీట్లు ఎన్ని..!?
jp-nadda-made-crucial-directions-for-telangana-bjp-leaders-over-joinings-in-the-party-here-the-det

తెలంగాణ పై బీజేపీ స్పెషల్ ఫోకస్

ఇతర పార్టీల నేతలు అంతా ఇపుడు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని జేపీ నడ్డా చెప్పడం వెనుక కొత్త వ్యూహం తెర మీదకు వస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుతో జనం విసిగి పోయారని.. బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. వచ్చిన వారిని వెంటనే చేర్చుకోవాలని కూడా ఆయన దిశా నిర్దేశం చేసారు. కాగా.. రాష్ట్ర పార్టీలో నెలకున్న వర్గపోరు పైనా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరికి వారుగా యమునా తీరుగా పార్టీ ఉందని సీరియస్అయ్యారు. విభేదాలను పక్కన పెట్టేసి పార్టీ కోసం జట్టుగా కలసి కట్టుగా పనిచేయాలని కోరారు. అయితే, బీజేపీలో ఆ పరిస్థితి లేకపోవటమే కాంగ్రెస్.. బీఆర్ఎస్ కు అవకాశంగా మారుతోంది. దీంతో.. బీజేపీ నాయకత్వం నేరుగా తెలంగాణ ఆపరేషన్ పర్యవేక్షిస్తోంది. రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+