టి స్థాయి వచ్చేదాకా!: మోడీకి బాబు, కొత్త రాజధానికి..

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులను కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వరుస భేటీల అనంతరం చంద్రబాబు మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించాలంటే కేంద్ర ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశానని చంద్రబాబు చెప్పారు. కనీసం పదేళ్లపాటు ప్రత్యేక హోదా ప్రకటించాలని, ప్రధానంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తరహాలో పారిశ్రామిక పన్ను రాయితీలు ఇవ్వాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని, వీటన్నిటికీ సంబంధించిన ఉత్తర్వులను తక్షణం జారీ చేయాలని కోరానన్నారు.

Ch

ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని, కేంద్ర ప్రభుత్వం వారికి రాష్ట్రం ఇచ్చి వారి మనోభావాలను గౌరవించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకోలేదని, ఇప్పుడు వారు ఇబ్బందుల్లో ఉన్నారని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించి సమన్యాయం చేయాలని, లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణతో సమానంగా, దేశంలోని అన్ని ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగే

వరకూ పదేళ్లయినా.. పదిహేనేళ్లయినా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాల్సి ఉంటుందని, తాము కూడా కష్టపడతామని, పెట్టుబడుల్ని ఆకర్షిస్తామని ప్రధాని, మంత్రులకు చెప్పానని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఏడాది రూ.13,579 కోట్ల రెవెన్యూ లోటు ఉందని, దీనిని కూడా తక్షణం సర్దుబాటు చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకూ సమ న్యాయం చేయాలని మోడీ, అరుణ్ జైట్లీలను కోరానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదగాలంటే ఏం చేయాలో.. ఎన్నేళ్లపాటు సహాయం చేయాలో ప్రణాళికా సంఘంతో మదింపు చేయించాలని మోడీని కోరానన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమిటో, అసలు రాష్ట్రం ఎక్కడ ఉందో కూడా అంతుబట్టకుండా ఉందని, సున్నా నుంచి మొదలు పెట్టాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రజాస్వామ్యంపైనే నమ్మకం పోయిందని, బీహార్-జార్ఖండ్, ఎల్టీటీఈ, జమ్ముకాశ్మీర్‌ల్లోలాగా ప్రధాన స్రవంతిని వదిలేసే ఆలోచనల్లో ఉన్న రాష్ట్ర ప్రజల్లో తాను ఒక ఆశ కల్పించానని, దానిని పోగొట్టకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రంపైనా ఉందన్నారు.

కొత్త రాష్ట్రంలోని సరికొత్త సవాళ్లను అంతా కలిసి అధిగమించాలని చెప్పారు. జూన్ రెండో తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ విడిపోతుందని, ఈలోపు రెండు రాష్ట్రాలకూ కేంద్ర ప్రభుత్వం జారీ చేయాల్సిన ఉత్తర్వులను తక్షణం విడుదల చేయాలని, ఈ మేరకు ప్రత్యేక సెల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేయాలని మోదీని కోరానని తెలిపారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని, పనుల్ని పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశానని చెప్పారు.

రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన రైతులు, డ్వాక్రా మహిళలను కాపాడే ఉద్దేశంతో రుణ మాఫీ పథకాలను ప్రకటించానని, రాష్ట్ర విభజన తర్వాత కూడా తాను ఆ మాటకు కట్టుబడి ఉన్నానని ప్రధాని, ఆర్థిక మంత్రికి చెప్పానని వివరించారు. ఆ హామీల అమలుకు అవసరమైన సహాయం చేయాలని కోరానన్నారు. విభజన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, పునాదుల నుంచి పనులు మొదలు పెట్టాల్సి ఉందని చెప్పారు.

హైదరాబాద్‌ను తెలంగాణకు ఇవ్వటంతో సీమాంధ్రకు ఆదాయం లేకుండా పోయిందని, పైగా కొత్త రాజధానిని కూడా నిర్మించుకోవాల్సి ఉందని, అదే సమయంలో కొత్త రాష్ట్రంలో మొదటి నెల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని.. ఈ విషయాలన్నీ తాను జైట్లీకి వివరించానన్నారు. తెలంగాణతో సమానంగా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చే వరకూ కొత్త రాష్ట్రానికి విధానాల్లోనూ, ఆర్థికంగానూ సహాయం చేయాలని కోరినట్లు చెప్పారు.

విభజన తర్వాత సాగునీటి రంగంలో తమకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయని చంద్రబాబు చెప్పారు. కృష్ణా, గోదావరి నదులపై మండలి, బోర్డులు ఏర్పాటు చేస్తామని చట్టంలోనే పేర్కొన్నారని, వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని, మండలికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఉంటారని, వీటిని త్వరగా ఏర్పాటు చేయాలని కోరానని వివరించారు. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశానన్నారు.

దీనికి నిర్దిష్ట కాల పరిమితిని నిర్ణయించుకోవాలని, రాబోయే 3-4 ఏళ్లలో దానిని నిర్మించాలని కోరారు. కొత్త రాజధానికి కూడా నీటిని కేటాయించాలని, కనీసం 30 టీఎంసీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరానని తెలిపారు. రెండు రోజుల క్రితం పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ తెరాస బంద్ సరికాదని చెప్పారు. ఈ అంశాన్ని తెరాస ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని, కక్షల్ని, విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందన్నారు.

వాస్తవానికి భద్రాచలం కూడా ఒకప్పుడు సీమాంధ్రలో భాగంగా ఉండేదన్నారు. తాము తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కోసం పట్టుబడుతున్నామని, రాష్ట్ర ఉద్యోగుల విషయంలోనూ తెరాస ముందు నుంచీ భారీగా విద్వేషాలు రెచ్చగొట్టిందని, అసలు విభజన విషయానికి వచ్చే సరికి మాత్రం తెలంగాణ ఉద్యోగులే ఎక్కువ ఉన్నారన్నారు. ఉన్నత స్థాయిలో ఆంధ్రా ఉద్యోగులు ఎక్కువ ఉంటే, కింది స్థాయిలో మాత్రం తెలంగాణ ఉద్యోగులే ఎక్కువని చెప్పారు. శంషాబాద్‌లోని దేశీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును కొత్తగా పెట్టడం లేదని, గతంలో ఉన్న పేరునే ఇప్పుడు పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+