Chandrayaan 3: చంద్ర మండలంలో ఘన స్వాగతం..!!
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. కీలక దశకు చేరుకుంది. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోన్నాయి.
కిందటి నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ 3 చందమామ వైపు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో.

చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండింగ్‌కు గురైన విషయం తెలిసిందే. చంద్రుడిపై ల్యాండింగ్ చేసే సమయంలో దాని వేగాన్ని నియంత్రించడంలో ఇస్రో విఫలమైంది. ఫలితంగా ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్.. వేల కిలోమీటర్ల వేగంతో నేరుగా చందమామ ఉపరితలాన్ని ఢీకొట్టి ముక్కలైపోయాయి. ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో జాగ్రత్తలను తీసుకున్నారు.
ఈ చంద్రయాన్ 2కు సంబంధించిన ఆర్బిటర్ ఇంకా.. చంద్రుడి కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు ఆర్బిటర్‌తో చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ అనుసంధానమైంది. ఆర్బిటర్- ల్యాండర్ మాడ్యుల్.. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోన్నాయి. డేటాను ఎక్స్ఛేంజ్ చేసుకుంటోన్నాయి. ఈ రెండింటి పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు ఇస్రో తెలిపింది.
చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్‌కు చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఘన స్వాగతం పలికిందంటూ ఇస్రో ట్వీట్ చేసింది. ల్యాండర్ మాడ్యుల్‌తో అనుసంధానం కావడానికి, అక్కడి నుంచి డేటాను సమీకరించుకోవడానికి మిషన్స్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌కి మరో ఆర్బిటర్ రూపంలో మరో మార్గం లభించినట్టయిందని తెలిపింది.












Click it and Unblock the Notifications