వీరు మాములు కేడీలు కాదు కదా..? గుండుపై బంగారం పేస్ట్.. స్మగ్లింగ్
బంగారం స్మగ్లింగ్ కోసం కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. కస్టమ్స్ తనిఖీల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఆశ్చర్యకర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వాటన్నింటినీ తలదన్నే ఓ ఉదంతం చోటుచేసుకుంది. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటన జరిగింది. అరగుండు, విగ్ సహాయంతో బంగారం అక్రమ రవాణా చేయబోయారు.
కస్టమ్స్ అధికారులకు వారు అడ్డంగా దొరికిపోయారు. రామనాథపురానికి చెందిన మర్ఘూబ్ అక్బర్ అలీ, చెన్నైకి చెందిన జుబేర్ హస్సన్ రఫీయుద్దీన్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ అధికారులకు దొరికిపోయారు. దుబాయ్ నుంచి చెన్నైకి చేరుకున్న వాళ్లను చూడగానే అధికారులకు ఏదో అనుమానం కలిగింది. వారి హెయిర్ స్టైల్ విచిత్రంగా ఉండటంతో అధికారులు వారిని ఆపి తనిఖీ చేశారు. విగ్గు పెట్టుకున్నట్టు గుర్తించారు. దాన్ని తొలగించగానే ఓ అరగుండు, దానిపై గమ్ముతో అతికించిన రెండు ప్యాకెట్లు కనిపించాయి.

వాటిని విప్పి చూడగా అందులోపేస్ట్ రూపంలో ఉన్న బంగారం కనిపించింది. దానిని పరీక్షించగా ఒక్కో ప్యాకెట్లో 595 గ్రాముల బంగారం ఉన్నట్టు తేలింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అధికారులు విడుదల చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దొంగలు ఎంత సృజనాత్మకత ప్రదర్శించినా కూడా చివరికి హెయిర్ స్టైల్ వారిని పట్టించేసిందని నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications