భార్య కాపురానికి రాలేదని, మరదలు స్నానం చేస్తుంటే వీడియోలు, అత్తకు ఫోటోలు, నాతోపెట్టుకుంటే !
చెన్నై: భార్య కాపురానికి రాలేదని, ఆమె తల్లి (అత్త), చెల్లి (మరదలు) అడ్డుతగులుతున్నారని కోపంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య చెల్లెలు స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి వాటిని మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను అత్తకు పంపించాడు. మీరు మర్యాదగా పద్దతి మార్చుకోవాలని, నా భార్యను కాపురానికి పంపించకపోతే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, అప్పుడు మీ కుటుంబం మొత్తం బాధపడినా ఫలితం లేదని అత్త కుటుంబ సభ్యులను హెచ్చరించాడు. అయితే మరదలు జీవితంతో చెలగాటం ఆడటానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

భార్య, భర్త, కుమార్తె
చెన్నై నగరంలోని వలసరవాక్కానికి చెందిన దినేష్ (31), సుమతి (28) దంపతులకు 7 ఏళ్ల కుమార్తె ఉంది. దినేష్ చెన్నైలోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దినేష్ అతని భార్య సుమతి, కుమార్తెతో కలిసి మొదట సంతోషంగానే ఉన్నాడు. అయితే తరువాత దినేష్ కుటుంబంలో చిన్నచిన్నగా సమస్యలు మొదలైనాయి.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
దినేష్ మద్యం సేవిస్తున్నాడు. ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్య సుమతిని వేధింపులకు గురి చేసేవాడని సమాచారం. ఈ విషయంలో దినేష్, సుమతి దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. ప్రతిరోజు గొడవ కావడంతో విరక్తి చెందిన సుమతి మూడు నెలల క్రితం భార్య దినేష్ మీద గొడవ పడి చెన్నైలోని మాధవరం పొన్నియమ్మన్ మేడులోని పుట్టింటికి వెళ్లిపోయింది.

అడ్డుపడిన అత్త, మరదలు
భార్య సుమతి పుట్టింటికి వెళ్లిపోవడంతో దినేష్ ఆవేదన చెందాడు. తరువాత సుమతి పుట్టింటికి వెళ్లి తాను పద్దతి మార్చుకుంటానని, దయచేసి ఇంటికి రావాలని దినేష్ వేడుకున్నాడు. అయితే సుమతి భర్తతో కలిసి వెలుతానని చెప్పడంతో ఆమె తల్లి, చెల్లెలు (22) అడ్డుకున్నారని తెలిసింది.

మరదలు స్నానం చేస్తుంటే !
తల్లి, చెల్లి అడ్డుచెప్పడంతో నీతో కలిసి నేను కాపురం చెయ్యలేనని, నీతో ఇంటికి రానని సుమతి తేల్చిచెప్పింది. తన కాపురానికి భార్య సుమతి తల్లి, చెల్లి అడ్డువస్తున్నారని, వారికి తగిన బుధ్దిచెప్పాలని దినేష్ రగిలిపోయాడు. భార్య సుమతి చెల్లెలు (22) స్నానం చేస్తున్న సమయంలో దినేష్ వీడియోలు తీశాడు.

బెదిరించాలని ప్రయత్నించి !
భార్య సుమతి సోదరి స్నానం చేస్తున్న సమయంలో దినేష్ కొన్ని ఫోటోలు తీశాడు. తరువాత భార్య సోదరి ఫోటోలు కొన్ని సేకరించి వాటిని కంప్యూటర్లో మార్ఫింగ్ చేశాడు. మార్ఫింగ్ చేసిన మరదలు ఫోటోలతో భార్య సుమతి కుటుంబ సభ్యులను బెదిరించి భార్యను కాపురానికి తీసుకురావాలని దినేష్ ప్లాన్ వేశాడు.

అత్తకు ఫోటోలు పంపించి !
మార్ఫింగ్ చేసిన ఫోటోలు, మరదలు స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను అత్తకు పంపించిన దినేష్ ఎలాగుంది, మీరు మర్యాదగా నా భార్యను కాపురానికి పంపించకపోతే వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. కూతురు ఫోటోలు చూసి షాక్ కు గురైన సుమతి తల్లి అల్లుడు దినేష్ మీద రగిలిపోయింది. కుమార్తె సుమతితో కలిసి దినేష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన మాధవరం పోలీసులు దినేష్ ను అరెస్టు చేసి పుళల్ జైలుకు పంపించారు. దినేష్ దగ్గర మొబైల్ లోని ఫోటోలను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని ఇన్స్ పెక్టర్ గోపినాథ్ తెలిపారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications