పట్టుబడ్డ అమెరికా ఓడ చీఫ్ ఇంజనీర్ సూసైడ్‌యత్నం
చెన్నై: ఆయుధాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన ఆమెరికా ఓడ సిబ్బందిలో ఒకరు ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా ఓడ సీమ్యాన్‌కు చెందిన ఓ చీఫ్ ఇంజనీర్ తమిళనాడు రాజధాని చెన్నైలోని జైలులో ఆత్మహత్యా ప్రయత్నం చేశారట.
సమాచారం మేరకు... సదరు చీఫ్ ఇంజనీర్ ఇలా ఆత్మహత్యాయత్నం చేయడం ఇది రెండోసారి. చీఫ్ ఇంజనీర్‌ను జైలులో ఉంచారు. అతను ఆత్మహత్యాయత్నం చేయగా జైలు సిబ్బంది సమయానికి చూసి కాపాడారు. కాగా, భాష రాకపోవడం, జైలు వాతావరణం ఒత్తిడికి, అసహనానికి గురి చేస్తున్నాయని, వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని జైలు సిబ్బంది చెప్పారు.

పది రోజుల క్రితం (శుక్రవారం) ఉదయం ఎంవి సీమ్యాన్ గార్డ్ ఓహియో ఓడ అక్రమ ఆయుధాలతో అమెరికా జలాల్లోకి ప్రవేశించింది. ఓడలో ఉన్న వారిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తీర ప్రాంత రక్షణ దళం దీనిని గుర్తించింది. ఓడలోని 35 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఎనిమిది మంది భారతీయులు కూడా ఉన్నారు.
ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదయింది. అక్రమాయుధాలు, మందుగుండు సామాగ్రి కలిగినందుకు ఈ ఎఫ్ఐఆర్ నమోదయింది. అంతేకాకుండా 1,500 లీటర్ల డీజిల్‌ను అక్రమంగా లోకల్ షిప్పింగ్ ఏజెంటు ద్వారా కొనుగోలు చేసినందుకు మరో కేసు నమోదయింది.












Click it and Unblock the Notifications