మారని చైనా... భారత్‌పై మరో అనూహ్య దాడి... కుట్రను బయటపెట్టిన సింగపూర్ సంస్థ...
భారత్-చైనా సరిహద్దులో జూన్ 15 రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణల తర్వాత చైనాకు చెందిన సైబర్ హ్యాకర్స్ భారత్‌కు చెందిన పలు కంపెనీలపై పడ్డారు. భారత్‌లోని పలు వ్యాపార సంస్థలు,మంత్రిత్వ శాఖలు,మీడియా సంస్థల సైట్లను హ్యాక్ చేసేందుకు ఆ హ్యాకర్స్ ప్రయత్నించారు. చైనా ప్రభుత్వంతో హ్యాకర్లకు లింకులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. సింగపూర్ కేంద్రంగా పనిచేసే సైఫర్మా రీసెర్చ్ ఈ విషయాలను బయటపెట్టింది.

ఏయే సంస్థలపై సైబర్ దాడులు...
సైబర్ దాడులపై నిఘా పెట్టడంలో సైఫర్మా రీసెర్చ్ పనిచేస్తుంది. ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లోని రిలయన్స్ జియో,ఎయిర్‌టెల్,బీఎస్ఎన్ఎల్,మైక్రోమ్యాక్స్,సిప్లా,సన్ ఫార్మా,ఎంఆర్ఎఫ్,ఎల్&టీ సంస్థలను చైనా హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు,భారత రక్షణ మంత్రిత్వ శాఖను కూడా వారు టార్గెట్ చేసినట్టు వెల్లడించడం గమనార్హం. వాణిజ్య రహస్యాలతో పాటు సంస్థలకు చెందిన సున్నిత సమాచారాన్ని హ్యాక్ చేయడం ద్వారా వాటి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కుట్ర జరిగిందని సైఫర్మా వెల్లడించింది.

ఆ 3 సంస్థలపై ఫోకస్...
హ్యాకింగ్ చేయాలనుకున్న రంగాల్లో ప్రధానంగా టెలికాం,ఫార్మా,మీడియా సంస్థలు,స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు,భవన నిర్మాణ సంస్థలు,టైర్ కంపెనీలు ఉన్నట్టు సైఫర్మా తెలిపింది. ఇక ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా మూడు శాఖలను హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు పేర్కొంది. అందులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,రక్షణ శాఖ,సమాచార మంత్రిత్వ శాఖ ఉన్నాయి. భారత్‌పై హ్యాకింగ్‌కి యత్నిస్తున్న ఈ హ్యాకర్ గ్రూప్స్ గతంలోనూ పలు దేశాల్లో హ్యాకింగ్‌కి పాల్పడ్డట్టు సైఫర్మా వెల్లడించింది.

హ్యాకింగ్ వెనుక ఆ రెండు గ్రూపులు
'హ్యాకర్స్ తమ సంభాషణల్లో ఐపీ అడ్రెస్‌లను షేర్ చేసుకున్నారు. మా విశ్లేషణ ప్రకారం ఈ ఐపీ అడ్రెస్‌లు,హ్యాకింగ్ క్యాంపెయిన్ వెనుక గోతిక్ పాండా,స్టోన్ పాండా అనే రెండు గ్రూపులున్నాయి. ఇవి చైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్న బలమైన హ్యాకింగ్ గ్రూప్స్.' అని సైఫర్మా తెలిపింది. గోతిక్ పాండా గ్రూపుకు గతంలో డిఫెన్స్,ఏరోస్పేస్,టెలికాం,ట్రాన్స్‌పోర్ట్,మాన్యుఫాక్చర్,ఇంజనీరింగ్ రంగాలను హ్యాక్ చేసిన ట్రాక్ రికార్డు ఉన్నట్టు పేర్కొంది. ఇక స్టోన్ పాండా గ్రూప్ వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన డేటాను చోరీ చేయడంలో ఎక్స్‌పర్ట్ అని తెలిపింది. సప్లై చైన్ ఇన్ఫర్మేషన్‌ను హ్యాక్ చేయడంలో ఈ గ్రూప్ యాక్టివ్‌గా పనిచేస్తుందని తెలిపింది.

ఆ దేశాల్లో కూడా..
భారత్‌తో పాటు జపాన్,కెనడా,బ్రెజిల్ దేశాలపై కూడా ఈ హ్యాకర్ గ్రూప్స్ ఫోకస్ చేసినట్టు సైఫర్మా పేర్కొంది. వెబ్ అప్లికేషన్స్‌లో ఉండే కొన్ని లోపాలను ఆధారంగా చేసుకుని ఈ గ్రూప్స్ హ్యాకింగ్‌కి పాల్పడుతున్నట్టు తెలిపింది. ఇందుకోసం ఓ ప్రత్యేక మాల్‌వేర్ ద్వారా డేటాపై నిఘా పెడుతున్నట్టు చెప్పింది. జూన్ 1 నుంచి జూన్ 18 వరకు ఉన్న సైబర్ డేటాను విశ్లేషించి చైనీస్ గ్రూప్స్ హ్యాకింగ్‌ను బయటపెడుతున్నట్టు స్పష్టం చేసింది.
-
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!!












Click it and Unblock the Notifications