Chotu Baba: 32 ఏళ్లుగా స్నానం చేయని చోటూ బాబా గురించి తెలుసా?

Chotu Baba: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో గల త్రివేణి సంగమం వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. గంగానదిలో పవిత్ర స్నానాన్ని ఆచరించేందుకు భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులతో పాటు సాధువులు, సన్యాసులు కూడా పాల్గొన్నారు. కానీ వారిలో చోటూ బాబాగా పిలవబడే గంగాపురి మహారాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయన 32 ఏళ్ల నుంచి స్నానం చేయలేదు.. దీంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. అసలు ఈ చోటూ బాబా ఎవరు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు స్నానం చేయకుండా ఉన్నారనేది తెలుసుకుందాం.

చోటూ బాబా పూర్తి పేరి గంగాపురి మహారాజ్. అత్యంత ప్రసిద్ధి చెందిన జునా అఖారా సాధువులలో ఆయన ఒక నాగసాధువు. అస్సాంలోని కామాఖ్య పీఠంతో సంబంధం కలిగి ఉన్నాడు. మిగిలిన సాధువులు, మహాత్ములు, కోట్లాది మంది భక్తులు మహా కుంభమేళాకు మా గంగా ఒడిలో పవిత్ర స్నానమాచరించడానికి వస్తారు, కానీ గంగాపురి మహారాజ్ ఇక్కడ ఒక్కసారి కూడా గంగానదిలో పవిత్ర స్నానమాచరించరు. గంగాపురి మహారాజ్ తన ఎత్తు కారణంగా మహాకుంభమేళాలో వార్తల్లో నిలిచాడు. అనంతరం ఆయనను మీడియా పలు ప్రశ్నలు అడగడంతో 32 ఏళ్లుగా స్నానం చేయలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది.

Chotu Baba The Ascetic Who Hasn t Bathed in 32 Years

స్నానం ఎందుకు చేయడం లేదో కూడా ఆయనకు మీడియాకు వెల్లడించారు. ఓ ముఖ్యమైన కోరిక ఉందని.. ఆ కోరిక నెరవేరే వరకు స్నానం చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ సంకల్పం నెరవేరిన రోజు.. ముందుగా క్షిప్రా నదిలో స్నానం చేస్తానని ఆయన తెలిపారు. చోటూబాబా చెప్పిన దాని ప్రకారం.. శరీరం కంటే అంతర్గత ఆత్మను పవిత్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఆయన ఇతర నాగసాధువుల గుంపుకు దూరంలో ఏకాంతంగా సాధన చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చాలా సార్లు ఆయన శ్మశానవాటికలో ధ్యానం కూడా చేస్తారు.

మొదటిసారి మహా కుంభమేళాకు వచ్చిన చోటూబాబా

గంగాపురి మహారాజ్ అలియాస్ ఛోటు బాబా మొదటిసారి ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వచ్చారు. ఈ చోటూ బాబాను చూడటానికి ప్రజలు గుంపులుగా గుమిగూడతారు. ఇతర సాధువులతో పోలిస్తే బాబా చూడటానికి చిన్నగా ఉండవచ్చు, కానీ ఆయన చాలా లోతైన విషయాలు మాట్లాడతారని భక్తులు చెబుతున్నారు. చోటూ బాబా స్నానం చేయకుండా ఉండడానికి ఆధ్యాత్మిక కారణాలు చెప్పినప్పటికీ కొంత మంది ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇలా చేయడం మంచి పద్ధతి కాదంటూ విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+