ముఖ్యమంత్రి రేసు: హీరో అజిత్‌ను జయలలిత రహస్యంగా కలిశారా?

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అంశంపై చర్చ సాగుతోంది. ప్రధానంగా నటుడు అజిత్ పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారని అంటున్నారు. నటుడు అజిత్‌ను ముఖ్యమంత్రి జయలలిత ఓసారి రహస్యంగా కలిశారని, అన్నాడీఎంకే భవిష్యత్తు పైన చర్చించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొందరు అభిమానులు ఈ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

CM Jayalalithaa has met Ajith secretly?

కాగా, జయలలిత స్థానంలో అజిత్‌ను నియమిస్తే అంతా బాగుంటుందని అంటున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో పన్నీరు సెల్వం ఇంఛార్జి ముఖ్యమంత్రిగా వ్యవహారిస్తున్నారు.

పన్నీరు సెల్వం పట్ల పార్టీ అధినాయకత్వం నమ్మకంగా లేదని చెబుతున్నారు. ఆయనకు పార్టీని నడిపేంత శక్తి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో అజిత్‌కు రాజకీయ అనుభవం లేదు, రాజకీయాల్లో ఎత్తులుపైఎత్తులు ఉంటాయి. అవి తెలియవు. దీంతో అది ఆయనకు ఇబ్బందికరపరిణామంగా కూడా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+