CM Stalin:దేశ ప్రజలకు స్టాలిన్ పిలుపు..కీలక సమయం,ఇక నిర్ణయం మీదే..!
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బీజేపీ పై విరుచుకుపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్ ఒక ఆడియో సందేశాన్ని (Podcast) దేశ ప్రజలకు విడుదల చేశారు. మోదీ సర్కార్ 2014 నుంచి ప్రజలను ఏ రంకా మోసం చేస్తోందో అందులో వివరించారు. ఈ పూర్తి సందేశం మీ కోసం.
"తమిళనాడు ముఖ్యమంత్రిగా, భారత దేశ పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నమూడవ అతిపెద్ద పార్టీగా, ద్రవిడ మున్నేట్ర ఖగళం పార్టీ అధ్యక్షుడిగా నేను ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ మాట్లాడుతున్నాను.భారతదేశం కోసం మీలో ఒక్కడిగా మాట్లాడటమే ఈ పాడ్‌కాస్ట్ ఉద్దేశం."

ఇండియా కోసం అందరం మాట్లాడాల్సిన పరిస్థితుల్లో ఉన్నామంటూ స్టాలిన్ చెప్పుకొచ్చారు. తరతరాలుగా వస్తున్న భారత సమైక్యతా భావాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ యత్నిస్తోందని మండిపడ్డారు. సమైక్యత వ్యవస్థనే కూల్చేందుకు ఆ పార్టీ కంకణం కట్టుకుందని స్టాలిన్ ఘాటు విమర్శలు చేశారు. 2014లో అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికీ రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రజలను మోసం చేసిందన్నారు. అదే సమయంలో విదేశాల నుంచి నల్లడబ్బును తరలించి దేశ ప్రజలకు పంచుతామని చెప్పుకొచ్చింది. ఊటా 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసిందని స్టాలిన్ చెప్పారు. ఇక రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ రైతు సమస్యలను గాలికొదిలేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సొంత ఇళ్లు లేని వారు ఎవరూ ఇకపై ఉండరని ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేస్తామని బీజేపీ చెప్పుకొచ్చిందని, అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకొస్తామని కథలు చెప్పిందని స్టాలిన్ అన్నారు. అధికారంలోకి వచ్చి పదేళ్లు కావొస్తున్నప్పటికీ ఎలాంటి హామీలు నెరవేర్చకపోగా... గుజరాత్ మోడల్ అని కథలు చెప్పి నరేంద్ర మోదీ మోడల్ అంటూ ప్రచారం చేసుకుని ఇప్పుడు ఏ మోడల్‌లో ఉందో చెప్పకుండానే సమయం అయిపోతోందని విమర్శించారు.

తమిళనాడులో ద్రవిడ మోడల్ తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని స్టాలిన్ అన్నారు. ఇక గుజరాత్ మోడల్ అనేదే ఎవరూ గుర్తు చేసుకోవడం లేదని చెప్పారు స్టాలిన్. అప్పటి వరకు ఎంతో బాగున్న భారత ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కార్ అధికారంలోకి రాగానే చిందరవందర చేశారని మండిపడ్డారు. భారత్‌లో బడా పారిశ్రామికవేత్తలకు మేలు కలిగేలా మాత్రమే మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది నోటిఫికేషన్లను ఇస్తోంది. భారత్‌లో సంక్షేమం అందరికీ అందాల్సి ఉండగా అది కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే అందుతోందని తీవ్రంగా మండిపడ్డారు స్టాలిన్.
ప్రభుత్వానికి చెందిన ఎయిర్‌ఇండియాను ఇప్పుడు ప్రైవేట్ పరం చేశారు. దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి బదిలీ అవుతున్నాయని స్టాలిన్ అన్నారు. మోదీ చెప్పినట్టు రైతుల ఆదాయం రెట్టింపు అవలేదు, పేదవారి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. వీటన్నిటినీ కప్పి పుచ్చేందుకు మతవాదాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి చలికాచుకుంటూ చూస్తున్నారని స్టాలిన్ మండి పడ్డారు.
2002లో గుజరాత్ అల్లర్లతో బీజేపీ విధ్వంసపే విత్తనం నాటితే అది 2023లో మణిపూర్‌ను నాశనం చేసిందని స్టాలిన్ మండిపడ్డారు. హరియాణాలో మత చిచ్చు పెట్టడంతో ఇవాల్టికి అక్కడ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలిగొంది.వీటన్నిటికీ ఇప్పుడు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే ఇక భారత్‌ను ఎవరూ బతికించలేరని చెప్పుకొచ్చారు. ఇండియా బహుముఖ ప్రజ్ఞకు, సమైక్యపాలనకు, ప్రజాస్వామ్యానికి ఎప్పుడైతే భంగం వాటిల్లిందో అటువంటి సమయంలో మార్గదర్శకంగా మారి డీఎంకే నిలిచింది. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నప్పుడు డీఎంకే నేత కరుణానిధి గళమెత్తి పోరాడారని స్టాలిన్ గుర్తుచేశారు.

దేశానికి ఎంతో మంది ప్రధానులను, రాష్ట్రపతులను అందించిన పార్టీ డీఎంకే అని స్టాలిన్ గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ ఒక చారిత్రాత్మకమైన అవసరం బాధ్యత తమపై ఉందని స్టాలిన్ చెప్పుకొచ్చారు. 2024లో ఎవరు అధికారంలోకి రావాలని ఆలోచించడం కన్నా ఎవరు అధికారంలోకి రాకూడదో ప్రజలు ఆలోచించాలని స్టాలిన్ చెప్పారు. పలు రాష్ట్రాల్లో ఒకరకమైన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంది బీజేపీ. ఇక రాష్ట్రాలకు హక్కుగా ఉన్న ఆర్థిక స్వపరిపాలనను జీఎస్టీ పేరుతో తమ వద్దకు లాగేసుకుంది బీజేపీ ప్రభుత్వం. జీఎస్టీ పరిహారంను మరో రెండేళ్లు పెంచాలని రాష్ట్రాలు కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రాష్ట్రం నుంచి కేంద్రానికి తమిళనాడు రాష్ట్రం ఎంతో ధనాన్ని సమకూరుస్తోందని స్టాలిన్ గుర్తుచేశారు. బీజేపీ పై విమర్శలు ఎక్కుపెట్టిన స్టాలిన్ పూర్తి ప్రసంగం ఈ పాడ్‌కాస్ట్‌లో వినండి.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications