సామాన్యులకు సీఎం విజయ్ భారీ ఆఫర్, వారిని పట్టిస్తే రూ లక్ష రివార్డు..!!

తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో తన మార్క్ నిరూపణ కోసం వ్యూహాత్మకంగా వ్యవహరి స్తున్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత వరుస నిర్ణయాలు తీసుకుంటున్న విజయ్.. ఇప్పుడు అవినీతి నిరోధించటం పైన ఫోకస్ చేసారు. అవినీతి చేస్తున్న వారిని పట్టిస్తే రూ లక్ష నజరానా ప్రకటించారు. అన్ని శాఖల ప్రక్షాళనకు మూడు నెలల డెడ్ లైన్ విధించారు. ఇప్పుడు విజయ్ నిర్ణయం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది.

సీఎం విజయ్ అవినీతి పైన ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయంలో సామాన్యుల ను భాగస్వాములను చేసారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా రూ.1,000 లంచం అడిగితే, ఆ విషయాన్ని సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి పట్టిచ్చిన సామాన్య ప్రజలకు ఏకంగా రూ.1,00,000 నగదు బహుమతి ఇస్తామని సీఎం విజయ్ ప్రకటన చేశారు. సామాన్య జనాన్నే అవినీతి నిరోధక సైన్యంగా మారుస్తూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం గా మారింది. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా అవినీతి నిరోధక విభాగాన్ని విజయ్ సర్కార్ బలోపేతం చేసింది. లంచం అడిగే అధికారులపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయడం కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1800 425 1555 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రవేశపెట్టింది. రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని వంద శాతం తుడిచిపెట్టేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్దిగా.. మోదీ మార్క్ నిర్ణయం - కేంద్ర మంత్రిగానూ..!?
ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్దిగా.. మోదీ మార్క్ నిర్ణయం - కేంద్ర మంత్రిగానూ..!?
cm-vijay-declares-major-anti-corruption-initiative-with-cash-reward-for-whistleblowers-here-the-det

సామాన్యులను భాగస్వామ్యం కల్పిస్తూ

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా టీవీకే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి కుటుంబానికి సమగ్ర సమాచారంతో కూడిన 'తమిళనాడు పౌరసత్వ కార్డు'ను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్డు ఉంటే ప్రజలు ఎలాంటి దరఖాస్తులు చేసుకోకుండా, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పుట్టినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా వారి ఇంటికే అందుతాయి. అవినీతిపైనే కాకుండా రాష్ట్రంలో డ్రగ్స్, అక్రమ మద్యం రవాణాపై కూడా సీఎం విజయ్ యుద్ధం ప్రకటించారు. తమిళనాడులో మాదకద్రవ్యాలు కొన్నా, అమ్మినా కఠినమైన గూండా చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు. అక్రమ మద్యం దుకాణాల తొలగింపుతో పాటు పోలీస్ స్టేషన్లలో పౌరులు ఫిర్యాదు చేసేటప్పుడు పారదర్శకత కోసం వీడియో తీసే విధానాన్ని తీసుకొచ్చారు. అధికార పార్టీ సభ్యులెవరూ తమ పేరు చెప్పి ప్రభుత్వ అధికారుల పనితీరులో జోక్యం చేసుకోకూడదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+