Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిర్‌ఫోర్స్ మహిళా అధికారిపై రేప్-కేసు విచారణ ఇక కోర్టు మార్షల్‌కు-బాధితురాలికి టూ ఫింగర్ టెస్టు...

కోయంబత్తూరులోని ఎయిర్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్(ఏఎఫ్ఏసీ)లో శిక్షణలో ఉన్న మహిళా అధికారిపై అమితేశ్ అనే ఫ్లైట్ లెఫ్టినెంట్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసులో 'కోర్టు మార్షల్'కు అడిషనల్ మహిళా కోర్టు అనుమతినిచ్చింది. దీంతో దీనికి సంబంధించిన విచారణ సాధారణ కోర్టుల్లో కాకుండా మిలటరీ పరిధిలోని కోర్టు మార్షల్‌లో జరగనుంది. ఇది ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన కేసు కావడంతో ఈ కోర్టు మార్షల్‌లో జడ్జిలుగా,ఇరువైపుల న్యాయవాదులుగా ఎయిర్‌ఫోర్స్ అధికారులే ఉంటారు.కేసును కోర్టు మార్షల్‌కు అప్పగించాల్సిందిగా కోయంబత్తూర్ పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఎయిర్‌ఫోర్స్ అధికారులు తన ఫిర్యాదును పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ బాధిత మహిళా అధికారి కోయంబత్తూరు సీపీకి ఫిర్యాదు చేశారు.దీంతో నిందితుడైన ఫ్లైట్ లెఫ్టినెంట్ అమితేశ్‌ను ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై ఐఏఎఫ్ అడిషనల్ మహిళా కోర్టును ఆశ్రయించింది.కేసును కోర్టు మార్షల్‌కు అప్పగించాలని... దీనిపై అంతర్గత న్యాయ విచారణ జరుపుతామని కోరింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా న్యాయస్థానం అందుకు అనుమతినిచ్చింది.

coimbatore woman iaf officer rape case mahila court allows court martial

అసలేంటీ కేసు :

కోయంబత్తూరులోని ఎయిర్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ(ఏఎఫ్ఏసీ)లో ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళా అధికారి ఒకరు శిక్షణ పొందుతున్నారు.సెప్టెంబరు 10న క్రీడా శిక్షణ సమయంలో ఆమె గాయపడ్డారు. గాయానికి చికిత్స పొంది, తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో... అదే కాలేజీలో శిక్షణ పొందుతున్న చత్తీస్‌గఢ్‌కు ఫ్లైట్ లెఫ్టినెంట్ అమితేశ్ (29) ఆమె గదిలోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై మొదట ఐఏఎఫ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా... వారి వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవని బాధిత మహిళా అధికారి ఆరోపించారు. దీంతో తాను కోయంబత్తూర్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఆ తర్వాత తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఐఏఎఫ్ అధికారులు ఒత్తిడి తెచ్చారని వాపోయారు. అంతేకాదు,అత్యాచారాన్ని నిర్దారించేందుకు ఐఏఎఫ్ వైద్యులు తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని... ఇందుకోసం టూ ఫింగర్ టెస్ట్ చేశారని పేర్కొన్నారు. వైద్యుల తీరుతో తాను మానసికంగా మరింత ఒత్తిడికి గురైనట్లు చెప్పారు.

ఐఏఎఫ్ ఆస్పత్రిలో వైద్యుల తీరుపై జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.టూ ఫింగర్ టెస్టు అశాస్త్రీయమైనదని.. దీనిపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఉన్నదని పేర్కొంది.ఐఏఎఫ్ వైద్యులు సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించారని,ఆమె మర్యాదకు,ప్రైవసీకి భంగం కలిగించారని ఆరోపించింది. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎయిర్ చీఫ్ మార్షల్‌ను కోరింది.అలాగే ఐఏఎఫ్ వైద్యులకు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ తెలియజేయాలని సూచించింది.

Recommended Video

    బండి సంజయ్ పై మండి పడ్డి గులాబి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి!! || Oneindia Telugu

    మరోవైపు బాధిత యువతి ఫిర్యాదుతో సదరు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను కోయంబత్తూర్ పోలీసులు అరెస్ట్ చేయగా... కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే తాజాగా మహిళా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నిందితుడిని తిరిగి ఐఏఎఫ్‌కు అప్పగించనున్నారు. కోర్టు మార్షల్‌లో విచారణ తర్వాత నిందితుడికి శిక్షను ఖరారు చేస్తారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+