ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ లో అమ్మాయి అనుమానాస్పద మృతి, మ్యాటర్ రివర్స్ !
బెంగళూరు/చిక్కబళ్లాపురం: ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర తాలూకా బిడగనహళ్లి సమీపంలోని నాగార్జున ఇంజినీరింగ్ కాలేజీలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని కోలార్ జిల్లా శ్రీనివాసపూర తాలూకా (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లోని యల్దూర్ గ్రామానికి చెందిన ప్రీతి(21) ఇంజినీరింగ్ కాలేజ్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. ఇదే కాలేజ్ లోని హాస్టల్ లో ప్రీతి అనుమానాస్పదంగా మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మంగళవారం ఇంజనీరింగ్ కాలేజ్ లోని హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు అందరూ కాలేజ్ కు వెళ్లారు. అందరితో పాటు ప్రీతి కూడా కాలేజ్ కు వెళ్లిందని తెలిసింది. అయితే కాలేజ్ మధ్యలోనే ప్రీతి ఆమె ఉంటున్న కాలేజ్ హాస్టల్ లోకి వెళ్లింది. ప్రీతితో పాటు నివాసం ఉంటున్న సాటి అమ్మాయిలు ఆ సమయంలో కాలేజ్ లోనే ఉన్నారని తెలిసింది.

ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని, కారణం తెలియరాలేదని కళాశాల యాజమాన్యం తెలిపింది. మృతురాలి తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి ప్రీతి చావుకు అసలు మ్యాటర్ తెలియదని, అసలు ఏం జరిగిందో తెలీయడం లేదని అంటున్నారు. మీ అమ్మాయి చాలా అనారోగ్యంతో ఉందని, వెంటనే మీరు రావాలని కాలేజ్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని, మేము వచ్చేసరికి మా కుమార్తె ప్రీతి శవమై కనిపించిందని ఆమె కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
తన కుమార్తె ప్రీతి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి తండ్రి బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి తాలూకాలోని విజయపూర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రీతి ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications