ఫోన్ కొంటామని రమ్మన్నారు.. తీరా వచ్చాక దిమ్మ తిరిగే షాక్!
మొబైల్ కొనుగోలు చేస్తామని చెప్పి సదరు యువకుడిని పిలిపించిన ఇంజనీరింగ్ యువకులు.. తీరా అతను రాగానే మొబైల్ ఫోన్ తో ఉడాయించారు.
చెన్నై: ఆన్ లైన్ పోర్టల్‌లో ఓ మొబైల్ ఫోన్ ను అమ్మకానికి పెట్టిన వ్యక్తికి ఇద్దరు ఇంజనీరింగ్ యువకులు షాక్ ఇచ్చారు. మొబైల్ కొనుగోలు చేస్తామని చెప్పి సదరు యువకుడిని పిలిపించిన ఇంజనీరింగ్ యువకులు.. తీరా అతను రాగానే మొబైల్ ఫోన్ తో ఉడాయించారు. చివరకు పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ప్రస్తుతం వారిద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రంజిత్ కుమార్ అనే వ్యక్తి రూ.40వేల విలువ చేసే సామ్ సంగ్ ఎస్7 ఎడ్జ్ ఫోన్ ను ఆన్ లైన్ పోర్టల్ లో అమ్మకానికి పెట్టాడు. అయితే మనోజ్ (అలియాస్ ప్రెడెరిక్), మోతిస్వరణ్ అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ ఫోన్ ను కొనుగోలు చేస్తామని అతన్ని పిలిపించారు.

చెప్పిన అడ్రస్ వద్దకు వచ్చి రంజిత్ కుమార్ వేచి చూస్తున్న తరుణంలో.. అక్కడికి చేరుకున్న మనోజ్, మోతిక్ స్వరణ్ అతనితో మాటలు కలిపారు. ఫోన్ ను చేతిలోకి తీసుకుని వివరాలు అడుగుతున్నట్టు నటించారు. అంతలోనే అనూహ్యంగా సెల్ ఫోన్ తో అక్కడినుంచి పరారయ్యారు. దీంతో షాక్ తిన్న రంజిత్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications