వందేభారత్ కోసం ఎంపీల మధ్య పోటీ
గ్వాలియర్‌కు వందేభారత్ సేవలందించేలా చూడాలంటూ కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విజ్ఞప్తి చేశారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు క్రేజ్ పెరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల మధ్య ఇప్పటికే ఈ రైళ్లు సర్వీసులందిస్తున్నాయి. ఆక్యుపెన్సీ విషయంలో ఈ రైళ్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. అత్యాధునిక వసతులతో తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుస్తోన్న సెమీ-హైస్పీడ్ రైళ్లు తమకూ కావాలంటూ పలువురు ఎంపీల నుంచి రైల్వేశాఖకు వినతిపత్రాలు వెల్లువలా వస్తున్నాయి. తమ నియోజకవర్గాలను అనుసంధానం చేస్తూ ఈ రైళ్లు నడపాలని డిమాండ్ చేస్తూ ఇప్పటివరకు అధికార, విపక్ష పార్టీలకు చెందిన 60మంది ఎంపీలు రైల్వేశాఖకు అర్జీలు పెట్టుకున్నారు.
వీరిలో పలువురు కేంద్రమంత్రులతో పాటు అధిక భాగం భారతీయ జనతాపార్టీ ఎంపీలే 14 మంది విపక్ష పార్టీల ఎంపీలు ఉన్నారు. ధార్వాడ్ నుంచి బెంగళూరుకు వందే భారత్ నడపాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ కోరగా.. గ్వాలియర్‌కు సేవలందించేలా చూడాలంటూ కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ నుంచి ముగ్గురు, సీపీఎం, వైసీపీ నుంచి ఇద్దరు, ఎన్ సీపీ, డీఎంకే, సమాజ్ వాదీ, జేడీయూ పార్టీల నుంచి కూడా డిమాండ్లు ఉన్నాయి. అప్నాదళ్, శివసేన ఎంపీలు సైతం ఈ రైళ్లను తమకూ కేటాయించాలని కోరుతున్నారు. జనవరి నెలవరకు ప్రవేశపెట్టిన 8 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లలో ముంబయి - గాంధీనగర్ మార్గంలోని రైలు అత్యధికంగా దాదాపు 127శాతం ఆక్యుపెన్సీతో, బిలాస్‌పుర్ - నాగ్‌పుర్ రైలు 55 శాతం ఆక్యుపెన్సీతో చివరి స్థానంలో నిలిచింది.
సికింద్రాబాద్ - విశాఖపట్నం మార్గంతోపాటు న్యూ ఢిల్లీ - వారణాసి మార్గంలో నడుస్తున్న వందేభారత్ రైళ్లు 125.76% ఆక్యుపెన్సీని నమోదు చేస్తున్నట్టు ఇటీవల రైల్వేశాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 10న ప్రధాని నరేంద్ర మోడీ ముంబయి నుంచి ఒకే రోజు రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించారు. దీంతో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 10కి పెరిగింది.












Click it and Unblock the Notifications