మీకు ధైర్యం ఉందా? నరేంద్రమోడీని కాల్చి చంపండి: కర్ణాటక కాంగ్రెస్ నేత

బళ్లారి: కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకరు మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యానాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాల్చి చంపాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ధైర్యం ఉంటే మోడీని తుపాకీతో కాల్చి చంపాలని అన్నారు. ఆ నాయకుడి పేరు బేలూరు గోపాలకృష్ణ. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఏర్పాటైన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన బహిరంగంగా ఈ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ను బీజేపీ కర్ణాటక శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పార్టీ కార్యకర్తల సమావేశంలో గోపాలకృష్ణ ప్రసంగిస్తూ.. జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే గురించి బీజేపీ నాయకులు గొప్పగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. అలాంటి నాయకులు మన దేశంలో ఉండాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని చెప్పారు. పార్టీ కార్యకర్తల్లో ఎవరికైనా ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్రమోడీని తుపాకీ గుండుతో కాల్చి చంపాలని అన్నారు. బీజేపీలో మరే ఇతర నాయకుడినీ చంపాల్సిన అవసరం రాదని అన్నారు.

Congress leader asks supporters to kill PM Narendra Modi, BJP shares video

దీనికి సంబంధించిన 29 సెకెన్ల నిడివి ఉన్న వీడియోను బీజేపీ కర్ణాటక శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. గోపాలకృష్ణపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రధానిని హత్య చేయమని పిలుపునిచ్చే హక్కు ఎవ్వరికీ లేదని కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసింది. హత్యా రాజకీయాలకు తాము దూరమని చెప్పే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. సొంత పార్టీ నాయకుడి మాటలను సమర్థిస్థారా? అని నిలదీసింది. పార్టీ పరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+