భవిష్యత్తులో అలా జరగవచ్చు, కాదనలేం: సోనియా గాంధీ

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: భవిష్యత్తులో తమ పార్టీకి నెహ్రూ - గాంధీ కుటుంబాలకు చెందినవారు కాకుండా ఇతరులు నాయకత్వం వహించవచ్చునని కాంగ్రెసు నేత సోనియా గాంధీ అన్నారు. తన కన్నా ఉత్తమ అభ్యర్థి అనే ఉద్దేశంతో 2004లో మన్మోహన్ సింగ్‌కు ప్రధాని పదవి అప్పగించామని ఆమె గుర్తు చేశారు.

  AP special status Protest : Rahul Gandhi joined

  మీ కుటుంబానికి చెందనవారి భవిష్యత్తులో కాంగ్రెసుకు నాయకత్వం వహించే అవకాశం ఉందా అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో అడిగితే ఎందుకు లేదు, భవిష్యత్తులో జరగవచ్చునని సమాధానం ఇచ్చారు.

  Congress May Be Headed By Someone Outside Family In Future: Sonia Gandhi

  గాంధీ కాకుండా ఇతరుల నాయకత్వం వహిస్తే కాంగ్రెసు మనుగడ సాగిస్తుందా అని ప్రశ్నిస్తే అ ప్రశ్న పార్టీ కార్యకర్తలకు వేయాలని అన్నారు. కాంగ్రెసులో, దాని నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకునే సంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు.

  కుటుంబ వారసత్వం విషయంపై స్పందిస్తూ అమెరికాలో బుష్, క్లింటన్ కుటుంబాలు ఉన్నాయని, మనదేశంలో చాలా రాష్ట్రాల్లో అది కొనసాగుతోందని అన్నారు. మీరేందుకు ప్రధాని పదవిని చేపట్టలేదని అడిగితే తన కన్నా మన్మోహన్ సింగ్ ఉత్తమమని తాను భావించినట్లు తెలిపారు తనకు తన పరిమితులు తెలుసునని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  UPA chairperson Sonia Gandhi on Friday said there may be a Congress President from outside the Nehru-Gandhi family in future.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి