అజ్ఞాతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రత్యక్షం, హైదరాబాద్ లో మకాం, ఖార్గే మీద పోటీకి సిద్దం!
బెంగళూరు: రెండు వారాలకు పైగా కాంగ్రెస్ నాయకులకు కనిపించుకుండా మాయం అయిన కర్ణాటకలోని చించోళి నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉమష్ జాధవ్ ప్రత్యక్షం అయ్యారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన నియోజక వర్గానికి చేరుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఉమేష్ జాధవ్ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. 2019 లోకసభ ఎన్నికల్లో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మల్లిఖార్జున ఖార్గే (కాంగ్రెస్) మీద పోటీ చెయ్యడానికి డాక్టర్ ఉమేష్ జాధవ్ సిద్దం అయ్యారని తెలిసింది.

రెండు వారాల నుంచి ఎవ్వరికి అందుబాటులోలేని డాక్టర్ ఉమేష్ జాధవ్ హైదరాబాద్ నుంచి బుధవారం అర్దరాత్రి చించోళి తాలుకాలోని బెటసూరు తాండాకు చేరుకున్నారు. గురువారం డాక్టర్ ఉమేష్ జాదవ్ తండ్రి గోపాలరావ్ 36 వర్దంతి కార్యక్రమంలో పాల్గోన్నారు.
ఉమేష్ జాదవ్ నాయక్ వర్గానికి చెందిన వారు. కులబర్గి జిల్లాలో మంచి పట్టు ఉన్న ఉమేష్ జాధవ్ ను బీజేపీలో చేర్చుకోవాలని ఆపార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. గురువారం చించోళి నియోజక వర్గంలోని తన అభిమానులతో భేటి అయ్యి తగిన నిర్ణయం తీసుకుంటానని ఉమేష్ జాధవ్ ఆయన సన్నిహితులతో అన్నారని సమాచారం. మొత్తం మీద 15 రోజుల నుంచి మాయం అయిన ఎమ్మెల్యే ఉమేష్ జాధవ్ తో మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications