పార్లమెంటుకు హార్లీ డేవిడ్సన్ బైక్‌పై మహిళా ఎంపీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి8) సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రాంజన్ మంగళవారం హర్లీ డేవిడ్సన్ బైక్‌పై పార్లమెంటుకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.
నీలం రంగు సల్వార్ కమీజ్ వేసుకొని హెల్మెట్ ధరించి రంజీత్ రాంజన్ మంగళవారం పార్లమెంటుకు హాజరయ్యారు. కాగా, ఆమె జన అధికార పార్టీ అధినేత, ఎంపీ పప్పుయాదవ్ సతీమణి.

మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం పార్లమెంటులో మహిళలే సభలో మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది. 543 లోక్‌సభ సభ్యుల్లో 66 మంది మహిళా సభ్యులు ఉండగా, రాజ్యసభలో 31మంది మహిళా సభ్యులు ఉన్నారు.












Click it and Unblock the Notifications