గాంధీ నెహ్రూ కుటుంబం లేకుంటే కాంగ్రెస్ జీరో: నథింట్ అంటూ దిగ్గీ రాజా కామెంట్స్
గెహ్లట్ వర్గం తిరుగుబాటుతో కాంగ్రెస్ అధ్యక్ష పదవీ రేసులోకి వచ్చిన దిగ్విజయ్ సింగ్ తన స్వరం పెంచారు. నెహ్రూ గాంధీ కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అవును ఆ కుటుంబం లేకుంటే కాంగ్రెస్ పార్టీ నథింగ్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ జీరో అవుతుందని కామెంట్ చేశారు.

99 శాతం మంది ఇలా..
పార్టీలో విభేదాలు చాలా సందర్భాల్లో వచ్చాయని దిగ్గీ రాజా గుర్తుచేశారు. కానీ 99 శాతం మంది కాంగ్రెస్ నేతలు గాంధీ నెహ్రూ ఫ్యామిలీ విధేయుడిగా ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. ఆ కుటుంబం.. స్వాతంత్ర్యం ముందు, తర్వాత దేశం కోసం త్యాగం చేసిందని పేర్కొన్నారు. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ లేకుండా పార్టీకి తగిన గుర్తింపే లేదని కామెంట్ చేశారు.

అలా జరగాల్సింది కాదు..
రాజస్థాన్‌లో జరిగిన ఘటన దురదృష్టకరం అని.. దానికి కూడా పరిష్కారం చూపొచ్చని దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి గెహ్లట్ పోటీ చేసి ఉంటే.. ఆయన నిర్ణయాన్ని పార్టీ గౌరవించేదని తెలిపారు. సోనియాను కలిసిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవీ రేసు నుంచి తప్పుకుంటున్నానని గెహ్లట్ తెలిపారు. అలాగే రాజస్థాన్ పరిణామం గురించి సోనియా గాంధీకి క్షమాపణ తెలిపానని కూడా మీడియాకు తెలియజేశారు.

గెహ్లటే కానీ
ఇప్పటికీ తమ అధికార అభ్యర్థి అశోక్ గెహ్లట్ అని తెలిపారు. అతను పోటీ చేయకున్నా.. గౌరవిస్తామని తెలిపారు. అతను కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటారని పేర్కొన్నారు. అధ్యక్ష పదవీ కోసం తనకు, థరూర్ మధ్య ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని దిగ్విజయ్ తెలిపారు. తాము ఇద్దరు గాంధీ, నెహ్రూ ఐడియాలజీతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఇద్దరం కలిసి పోటీచేస్తున్నామని.. ఎవరూ గెలిచిన పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications