అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా ఎంత మంది అంటే ?, ఇంకా ఎవరైనా పార్టీలో ఉన్నారా !
బెంగళూరు/అనంతపురం: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తామని, మేమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు అన్ని నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల పరిశీలకు జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుల లిస్ట్ చూసిన ఆ పార్టీ కార్యకర్తలు షాక్ అయ్యారు.
మీ పార్టీలో ఇంకా ఎవరైనా ఉన్నారా ?, లేక అందరిని అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా ప్రకటించేశారా ? అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఒక్క అసెంబ్లీ నియోజక వర్గంలో తప్పా 223 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నది.

మేలుకోలే నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షం అయిన సర్వోదయ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తోంది. ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి టిక్కెట్లు దక్కలేదనే కోపంతో సొంత పార్టీ నేతలతో అసమ్మతి సెగ మొదలైయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 223 నియోజక వర్గాలకు 61 మంది ఎన్నికల పరిశీలకులను నియమించడం హాట్ టాపిక్ అయ్యింది.
కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య తదితరులు సిద్దం చేసిన ఎన్నికల పరిశీలకుల జాబితాను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనుమతితో విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ పీపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి (అనంతపురం జిల్లా మడకసిర లీడర్), లోక్ సభ ఎంపీ కార్తీ చిదంబరం పేర్లు ఎన్నికల పరిశీలకుల లిస్ట్ లో ఉన్నాయి,

వీరితో పాటు ఎంపీ బెన్ని బెహనన్, సంజయ్ నిరుపమ్, ఎంపీ జ్యోతిమణి తదితరుల ఆధ్వర్యంలోని కమిటీని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. శనివారం నుంచి ఎన్నికల పరిశీలకు వారికి కేటాయించిన నియోజక వర్గాల్లో విధులు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
అసమ్మతితో ఉన్న నేతలకు ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఉన్నత స్థానం కల్పిస్తామని, నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఎన్నికల పరిశీలకులు బుజ్జగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల పరిశీలకు ప్రభావం ఎంత వరకు ఉంటుంది ?, ఎన్నికల పరిశీలకుల వలన కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకు లాభం ఉంటుంది ? అనే విషయం ఎన్నికల ఫలితాల తరువాతే తెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications