కసబ్, యాకూబ్ ఉరి: కక్ష పెంచుకున్న కానిస్టేబుల్
పాట్నా: పాకిస్థాన్ కరుడుకట్టిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, ముంబై వరస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమెన్ ను ఉరి తీసినందుకు రాజస్థా న్ డీజీపీ, ముంబై సీనియర్ పోలీసు అధికారులను చంపేస్తానని ఎస్ఎమ్ఎస్ పంపించిన కానిస్టేబుల్ ను బీహార్ పోలీసు అధికారులు అరెస్టు చేశారు.
బీహార్ లోని సిగోరి అనే గ్రామంలో నివాసం ఉంటున్న షా ఉజెయిర్ అనే కానిస్టేబుల్ ను అరెస్టు చేశామని పాట్నా సీనియర్ ఎస్పీ వికాస్ వైభవ్ అన్నారు. ఇతని మొబైల్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని ఎస్పీ వికాస్ వైభవ్ చెప్పారు.
వికాస్ వైభవ్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జహనబాద్ జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్ లో షా ఉజెయిర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇతను ఇటివల రాజస్థాన్ డీజీపీతో సహ పోలీసు ఉన్నతాధికారులకు ఎస్ఎమ్ఎస్ లు పంపించాడు.

ముంబై 26/11 దాడులు, 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులకు సంబంధించి అజ్మల్ కసబ్, యాకూబ్ మెమెన్ లను ఉరి తీశారని, అందుకు తాను కక్ష పెంచుకున్నానని, త్వరలో తాను వరుస బాంబు పేలుళ్లు సృష్టిస్తానని ఎస్ఎమ్ఎస్ చేశాడు.
అంతే కాకుండా రాజస్థాన్ డీజీపీతో పాటు, పోలీసు అధికారులను అంతం చేస్తానని బెదిరించాడని పాట్నా ఎస్పీ వికాస్ వైభవ్ చెప్పారు. ఇతను ఆరోగ్యంగా ఉన్నాడని, అతను మానసిక పరిస్థితి బాగుందని, ప్రస్తుతం విధులలో ఉన్నాడని అన్నారు.
అయితే ఇటివల కాలంలో షా ఉజెయిర్ తరచూ ఇలాంటి ఎస్ఎమ్ఎస్ పంపించడం మొదలు పెట్టాడని, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అతని మొబైల్ నెంబర్ కాల్ డేటాను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications