Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎలక్షన్ ఎఫెక్ట్, రూ. 100 కోట్లకు పరువు నష్టం, మల్లికార్జున ఖార్గేకి కోర్టు సమన్లు !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో మా పార్టీ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు దేశంలోని బీజేపీ నాయకులు, హిందూ సంఘ, సంస్థలు మండిపడ్డాయి.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బజరంగ్ దళ్ నిషేధం ఎన్నికల హామీ కర్ణాటకలో కూడా కలకలం రేపింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా 135 సీట్లు కైవసం చేసుకుని ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యింది. కర్ణాటకలో ఎవరిని సీఎం చెయ్యాలి అంటూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చర్చలు జరుపుతోంది.

Mallikarjun Kharge

ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖార్గేకి సమన్లు జారీ చేసిన కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. బజరంగ్ దళ్ ను దేశ ద్రోహిగా పోల్చుతూ ప్రజల్తో తప్పుడు సంకేతాలు పంపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపిస్తూ పంజాబ్ కు చెందిన హిందూ సురక్షా పరిషత్ అధ్యక్షుడు హితేష్ భరద్వాజ్ కోర్టును ఆశ్రయించారు.

Mallikarjun Kharge

బజరంగ్ దళ్ తో పాటు హిందువులను దేశ ద్రోహులుగా అభివర్ణిస్తు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ మీద, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రూ. 100 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని హితేష్ భరద్వాజ్ పంజాబ్ లోని సంగ్రూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వాదనలు విన్న సంగ్రూర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి రమణదీప్ కౌర్ జులై 10వ తేదీన విచారణకు హాజరుకావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకి సమన్లు జారీ చేశారు. మొత్తం మీద కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద రూ. 100 కోట్లకు పరువు నష్టం కేసు పంజాబ్ లో వెయ్యడంతో ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకి సమన్లు జారీ అయ్యాయి. ఈ విషయంలో ఏఐసీసీ నాయకులు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా స్పందించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+