రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ ధరలు తగ్గిస్తూ కీలక నిర్ణయం
నవరాత్రి, దసరా, దీపావళి పండగల నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లు, రైల్వే స్టేషన్లు, ప్లాట్ ఫార్మ్ లు, కంపార్ట్ మెంట్స్ లో విక్రయించే రైల్ నీర్ వాటర్ బాటిల్ ధరను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ రైల్ నీర్ వాటర్ బాటిల్ ధర లీటరు రూ. 15 కు విక్రయిస్తుండగా ఆ ధరను రూ. 14 కు తగ్గించింది. అలాగే 500 ఎం ఎల్ హాఫ్ లీటర్ బాటిల్ ధరను కూడా తగ్గించింది. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.1 తగ్గించింది. గతంలో రూ.10 ఉన్న హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ధర ఇప్పుడు కేవలం రూ.9లకే లభించనుంది.
రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్ ఫార్మ్ లు, కంపార్ట్ మెంట్స్ లో విక్రయించే రైల్ నీర్ వాటర్ బాటిల్ ధరనప తగ్గిస్తూ తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైల్ నీర్ వాటర్ బాటిల్ ధర లీటర్ రూ.15లకు విక్రయిస్తున్నారు. ఇక నుంచి ఈ బాటిల్ ధర రూ.14 లకే లభించనుంది. అలాగే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ధర కూడా తగ్గింది. దీని మీద రూ.1 తగ్గించింది. గతంలో రూ.10 ఉన్న హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ధర ఇప్పుడు కేవలం రూ.9లకే లభించనుంది. ఇక తగ్గించిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. రైల్వే శాఖ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు వస్తు సేవలపై జీఎస్టీ తగ్గించిన నేపథ్యంలో రైల్వే శాఖ కూడా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. రైల్ నీర్ బ్రాండ్ వాటర్ బాటిల్స్ ధరలు తగ్గించింది. జీఎస్టీ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పండగ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వేశాఖ.












Click it and Unblock the Notifications