సీనియర్ సిటిజన్ పై ఎస్ఐ ప్రతాపం (వీడియో)
లక్నో: పెద్దలను గౌరవించడం భారతదేశ సాంప్రదాయం. సీనియర్ సిటిజన్స్ ను గౌరవించాలని ప్రభుత్వాలు పదేపదే చెబుతుంటాయి. అలాంటిది పోలీసు ఉద్యోగం చేస్తున్న ఓ ఎస్ఐ వృద్దుడి పట్లు అసభ్యంగా ప్రవర్తించి అవమానించడంతో అతనిని పై అధికారులు సస్పెండ్ చేసి ఇంటికి పంపించి తగినగుణపాఠం చెప్పారు.
లక్నోలోని జనరల్ పోస్ట్ ఆఫీస్ బయట ఉన్న ఫ్లాట్ ఫాం మీద గత 35 సంవత్సరాల నుంచి కృష్ణకుమార్ (65) అనే ఆయన టైప్ రైటర్ తో చిన్నచిన్న పత్రాలు టైప్ చేసుకుంటూ జీవిస్తున్నారు. కంప్యూటర్ కాలంలో టైప్ చెయ్యడానికి చాల మంది ఆసక్తి చూపించకపోవడంతో ఆయన రోజుకు రూ. 50 సంపాదించడం కష్టం అయ్యింది.
ఇటివల ప్రదీప్ కుమార్ అనే ఎస్ఐ అటువైపు వెళ్లాడు. ఫుట్ పాత్ మీద కూర్చుని టైప్ చెయ్యరాదని, వెంటనే ఖాళీ చెయ్యాలని హెచ్చరించాడు. అయితే బతుకుబండి లాగించడానికి కృష్ణకుమార్ అక్కడే కుర్చుని టైప్ చేసుకుంటున్నారు.
శనివారం అక్కడికి వెళ్లిన ఎస్ఐ ప్రదీప్ కుమార్ ఖాకీ ప్రతాపం చూపించాడు.టైప్ రైటర్ ను కాలితో తన్ని నాశనం చేశాడు. ఆ వృద్దుడు చేతులు జోడించి వద్దు సార్ అంటున్నా వినలేదు. స్థానిక మీడియా సభ్యులు ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. విషయం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వరకు వెళ్లింది.
వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేసి కృష్ణకుమార్ కు కొత్త టైప్ రైటర్ తీసివ్వాలని అఖిలేష్ యాదవ్ శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ పోలీసు అధికారులు కృష్ణకుమార్ ఇంటికి చేరుకుని క్షమాపణలు చెప్పి కొత్త టైప్ రైటర్ ను ఆయనకు అందించారు.












Click it and Unblock the Notifications