సూపర్ గురూ.. పూలతో మాస్క్, దండలతోపాటు ఫ్రీ.. ఏమీ అవెర్‌నెస్ బాసూ...

కరోనా వేరియంట్లతో జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్స్.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే మళ్లీ కరోనా కేసులు మొదలయ్యాయి. వైరస్ నిర్మూలన మాస్క్ ధరించడమే శ్రీరామరక్ష. శానిటైజర్ రాసుకుంటూ.. టీకా తీసుకుంటూ గడపాల్సిందే. మాస్క్ కంపల్సరీ కావడంతో.. రకరకాల వైరెటీలు వస్తున్నాయి. అయితే ప్లవర్ మాస్క్ కనిపించి అలరించింది.

వివాహ కార్యక్రమాల్లో కరోనాపై అవగాహన కల్పించేలా ఓ పూల వ్యాపారి వధూవరులకు పూలతో మాస్కు తయారుచేశారు. మదురై స్వామికన్నిగైకు చెందిన పూలమాల తయారీదారుడు మోహన్‌ మాస్కులు తయారుచేశాడు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేలా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. తమ వృత్తికి సంబంధించి అవగాహన కల్పించేలా పూలతో మాస్కు తయారుచేశామని చెప్పారు. ఒకసారి వినియోగించేలా మల్లెపూలు, గోల్డ్‌, రెడ్‌ కలర్‌ డిజైన్‌ పూలతో రూపొందించామని పేర్కొన్నారు. ఆర్డర్‌ చేసిన వారికి పూలదండలతో పూల మాస్కు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు.

కరోనా విజృంభిస్తోండటం.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మోహన్ చేసిన ప్రయత్నం బాగుందని అందరూ అంటున్నారు. మాస్క్ గురించి ప్రజలకు అవేర్ నెస్ చేయడం మంచి పని అని ప్రశంసిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిందే. దీంతో వైరస్ నిర్మూలన జరుగుతుంది. నిపుణులు చెప్పిన సూచనలను పాటించాలని కోరుతున్నారు.

corona awareness:flower mask at tamilnadu madurai

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+