దేశంలో మొదటి కరోనా వైరస్ కేసు నమోదు .. కేరళ విద్యార్థినికి కరోనా వైరస్
Recommended Video
భారతదేశంలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఒక విద్యార్థినికి కరోన వైరస్ సోకినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. వూహాన్‌లో చదువుతూ ఆ విద్యార్థిని ఇండియాకు వచ్చిన విద్యార్థినికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు.
ఇది దేశంలో మొదటి కేసుగా చెప్తున్నారు. ఇప్పుడు చైనా మాత్రమే కాదు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇటు మన దేశంలోనూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ వైద్య శాఖాధికారులు అలెర్ట్ అయ్యారు. ఇక వైరస్ సోకినా విద్యార్థినికి వైద్య సేవలు అందిస్తున్నారు. బంధుమిత్రులు విద్యార్థినికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇండియాలోనూ కరోనా వైరస్
ఇది దేశంలో మొదటి కేసుగా చెప్తున్నారు. ఇప్పుడు చైనా మాత్రమే కాదు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇటు మన దేశంలోనూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ వైద్య శాఖాధికారులు అలెర్ట్ అయ్యారు. ఇక వైరస్ సోకిన విద్యార్థికి వైద్య సేవలు అందిస్తున్నారు. బంధుమిత్రులు విద్యార్థికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

కేరళలో తొలి కేసు నమోదు
కేరళలో కరోనావైరస్ యొక్క మొట్టమొదటి కేసు నమోదైనట్టు వైద్య శాఖాధికారులు ధృవీకరించారు . ఆ విద్యార్థి కేరళకు చెందినవాడు అని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ లక్షణాలతో ఉన్న రోగి నుండి రక్త నమూనాలను కరోనావైరస్ టెస్ట్ కోసం పంపించారు . పాజిటివ్ రావటంతో అతనిని ఆసుపత్రిలో ఒంటరిగా ఉంచారు . ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉంది . రోగిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు .

అప్రమత్తమైన యంత్రాంగం .. వైద్య శాఖామంత్రి అలెర్ట్
ఇదిలావుండగా, కేరళ ఆరోగ్య మంత్రి కె.కె.శైలజ ఆరోగ్య కార్యదర్శి మరియు ఆరోగ్య సేవల డైరెక్టరేట్ నుండి ఇతర అధికారులతో సమావేశమై పరిస్థితిని తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచ నిపుణులకు సంబంధించిన కరోనావైరస్ మహమ్మారి గత ఏడాది డిసెంబర్ ప్రారంభంలో చైనా యొక్క వుహాన్ నగరంలో మరణ మృదంగం మోగిస్తుంది. ఇప్పటివరకు 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది.

మరికొంత మందికి లక్షణాలు ఉన్నట్టు అనుమానం
కేరళలో, త్రిశూర్, తిరువనంతపురం, పతనమిట్ట, మలప్పురం నుండి ఒక్కొక్కరు, ఎర్నాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులను వివిధ ఆరోగ్య కేంద్రాలలో రహస్య వార్డులలో ఉంచినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. ఇక ఈ నేపధ్యంలో ముందుజాగ్రత్త చర్యగా, భారతదేశంలో ఆరోగ్య అధికారులు వివిధ విమానాశ్రయాలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనావైరస్ లక్షణాలు ఉంటె వెంటనే వారిని ఆరోగ్య కేంద్రాలలో వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులకు తరలించే ఆలోచనలో ఉన్నారు.
-
పాకిస్తాన్ అనాగరిక దాడి- తీవ్రంగా స్పందించిన భారత్..! -
రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..? -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications