బీహార్ ఫలితాలపై ఉత్కంఠ, అటుఇటగా ఎగ్జిట్ పోల్స్
పాట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితిష్‌కుమార్, మహాకూటమి మధ్య పోరుగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(ఆదివారం) విడుదల కానున్నాయి. నువ్వా, నేనా అన్నట్టు సాగిన ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠకు రేపు తెరపడనుంది. అయితే ఇటు ఎన్డీఏ, అటు మహాకూటమి వేటికవే విజయంపై ధీమాగా ఉన్నాయి.
మొత్తం 243 సీట్లకు ఎన్నికలు జరగగా ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికల్లా విజయం ఎవరిదో దాదాపు తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలావరకు ఎన్డీయే.. మహాకూటమి మధ్య హోరాహోరీ నడుస్తుందని పేర్కొన్నాయి. స్వల్ప సీట్ల తేడాతో ఎన్డీయే కూటమి విజయం సాధించవచ్చని అంచనా వేశాయి.

టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీయేకు పూర్తి మెజారిటీ కట్టబెట్టాయి. ఐదు విడతలుగా జరిగిన బిహార్ ఎన్నికలు అక్టోబరు 12న ప్రారంభం కాగా, నవంబరు 5న ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆస్తకి నెలకొంది.
అన్ని పార్టీల హేమాహేమీలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఎన్డీయే, మహాకూటమిలోని ముఖ్య నాయకులపై ఎన్నికల అధికారులు 12 కేసులు నమోదు చేశారు.

ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన 30 ర్యాలీల్లో పాల్గొనగా, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 85 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాగా, ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మాత్రం అందరిలో ఉత్కంఠను మరింత రెట్టింపు చేస్తున్నాయి.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications